Home> వినోదం
Advertisement

Mumaith Khan news: ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్‌ని చీట్ చేసిందా ?

Cheating allegation on Actress Mumaith Khan: హైదరాబాద్‌: బిగ్ బాస్ తొలి సీజన్‌తో తెలుగు ఆడియెన్స్‌ని పలకరించిన సినీ నటి, ఐటం గాళ్ ముమైత్ ఖాన్ ( Actress Mumait Khan ).. ఆ తర్వాత అంతగా మీడియా ముందుకు రాలేదు. సినిమా అవకాశాలు కూడా అంతకుముందు ఉన్నంత స్థాయిలో లేకపోవడంతో  ముమైత్ ఖాన్ పేరు ఇటీవల కాలంలో అంతగా వార్తల్లో రావడం లేదు.

Mumaith Khan news: ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్‌ని చీట్ చేసిందా ?

Cheating allegation on Actress Mumaith Khan: హైదరాబాద్‌: బిగ్ బాస్ తొలి సీజన్‌తో తెలుగు ఆడియెన్స్‌ని పలకరించిన సినీ నటి, ఐటం గాళ్ ముమైత్ ఖాన్ ( Actress Mumait Khan ).. ఆ తర్వాత అంతగా మీడియా ముందుకు రాలేదు. సినిమా అవకాశాలు కూడా అంతకుముందు ఉన్నంత స్థాయిలో లేకపోవడంతో  ముమైత్ ఖాన్ పేరు ఇటీవల కాలంలో అంతగా వార్తల్లో రావడం లేదు. ఐతే, ఓ క్యాబ్ డ్రైవర్ చేస్తోన్న ఆరోపణలతో తాజాగా ఆమె పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. Also read : Sonu Sood receives grand welcome: సోనూసూద్‌కి ఘన స్వాగతం

మూడు రోజుల గోవా ట్రిప్ ( Goa trip ) కోసం తన క్యాబ్ కిరాయికి మాట్లాడుకున్న ముమైత్ ఖాన్.. ఆ టూర్‌ను 8 రోజులకు పొడిగించిందని.. అయినా సరే తన డబ్బులు ఇస్తుంది కదా అని అనుకుంటే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ ( Cab driver ) ఆరోపించాడు. ముమైత్‌ ఖాన్ తనకు రూ.15 వేల వరకు బాకీ పడిందని.. ఎన్నిసార్లు అడిగినా ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని రాజు మీడియా ఎదుట వాపోయాడు. 

గోవా పర్యటనకు ( Goa tour ) వెళ్లొచ్చే వరకు టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామడేషన్‌కు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని చెప్పిన ముమైత్ ఖాన్.. ఆఖరికి ఆ డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. తాను మోసపోయినట్టుగా మరో డ్రైవర్‌ మోసపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ఘటనను మీడియా దృష్టికి తీసుకొస్తున్నట్టు చెప్పిన రాజు.. క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్‌తో చర్చించిన అనంతరం పరిష్కారం లభించకపోతే తాను ముమైత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాడు. క్యాబ్ డ్రైవర్ చేస్తున్న ఈ ఆరోపణలపై ముమైత్ ఖాన్ ఏమని స్పందిస్తుందో మరి. Also read : Bollywood: ముంబైలో మరో నటుడు ఆత్మహత్య కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More