Home> వినోదం
Advertisement

Arasavalli temple: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మెగా హీరో

Sai dharam tej: రేపు బ్రో మూవీ ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. మెగా హీరో సాయిధరమ్ తేజ్ అరసవిల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఆరోగ్యం బాగుండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. 
 

Arasavalli temple: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మెగా హీరో

Sai dharam tej Visit Arasavalli Sun temple: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ శ్రీకాకుళం జిల్లాలో సందడి చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవిల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఈ మెగా హీరోకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గుడిలోని అనివెట్టి మండపంలో అర్చకులు సాయి ధరమ్ తేజ్ కి వేద మంత్రాలతో ఆశీర్వాదించారు. అంతేకాకుండా ఈవో వి.హరి సూర్య ప్రకాష్ తేజ్ కు ప్రసాదంతోపాటు జ్ఞాపికను కూడా అందజేశారు. 

''తాను 2014లో ఇక్కడకు వచ్చానని... మళ్లీ  ఇప్పుడే రావడమని . తన ఆరోగ్యం బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని.. తాను నటించిన బ్రో సినిమా ట్రైలర్ రేపు రిలీజ్ కానుందని.. మూవీ ఈనెల 28న విడుదల అవుతుందని'' ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్(Sai dharam tej) అన్నాడు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులతో పాటు ఆలయ పాలకమండలి సభ్యులు కూడా పాల్గొన్నారు. సాయి ధరమ్ తేజ్ ను చూసేందుకు మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. 

Also Read: Pushpa 2: 'బేబీ' ఈవెంట్ లో ‘'పుష్ప 2'’ డైలాగ్‌ లీక్‌ చేసిన అల్లు అర్జున్‌, వీడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. మామాల్లుళ్లు ఇద్దరూ చేస్తున్న ఈ చిత్రం వినోదయ సిత్తం అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీకి నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోహీరోయిన్లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ కు, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ కుడా షురూ చేసింది. ఈ సినిమాకు ఎస్ఎస్. థమన్ రాశారు. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు.

Also Read: Mahesh Babu: 'గుంటూరు కారం' సినిమాకు మహేష్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More