Home> వినోదం
Advertisement

Mumbai Drugs case: విచారణకు హాజరైన ప్రముఖ హీరోయిన్లు

ముంబై డ్రగ్స్ కేసు హీరోయిన్ల చుట్టూ తిరుగుతోంది. ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు. 

Mumbai Drugs case: విచారణకు హాజరైన ప్రముఖ హీరోయిన్లు

ముంబై డ్రగ్స్ కేసు ( Mumbai Drugs case ) హీరోయిన్ల చుట్టూ తిరుగుతోంది. ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు. 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ  వ్యవహారం ( Sushant singh rajput death issue ) అనేక మలుపులు తిరుగుతోంది. ప్రారంభంలో ఈ కేసుపై నెపోటిజమ్ ( Nepotism ) ఆరోపణలు వెల్తువెత్తగా..అనంతరం అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చుట్టూ తిరిగింది. ఇందులో భాగంగా జరిగిన విచారణలో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. దాంతో రంగంలో దిగిన ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( Mumbai Norcotics control bureau ) విచారణ జరుపుతోంది. ఈ విచారణలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చాయి. ఇందులో భాగంగా బాలీవుడ్ అగ్రనటీమణులైన దీపికా పడుకోన్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లకు ముంబై ఎన్సీబీ నోటీసులు సమన్లు జారి చేసింది.

ముంబైలోని ఎన్సీబీ జోనల్ కార్యాలయానికి ఇవాళ హీరోయిన్లు దీపికా పడుకోన్ ( Deepika padukone ) ముందుగా చేరుకున్నారు. కాస్సేపటి తరువాత శ్రద్ధాకపూర్ ( Shradha kapoor ) , సారా అలీఖాన్ ( Sara Ali khan ) లు కూడా విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం వీరి స్టేట్ మెంట్ ఆధారంగా తదుపరి పరిణామాలు ఉండనున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులో తీసుకుంది.

మరోవైపు డ్రగ్స్ కేసులో కేవలం హీరోయిన్ల పేర్లే వెలుగుచూస్తుండటం...ఏ ఒక్క హీరో పేరు కూడా బయటకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ లో ఉన్న నెపోటిజమ్ తో పాటు జెండర్ ఫీలింగ్ , ఆధిపత్యం కూడా ఉందనే విమర్శలకు బలం చేకూరుస్తోంది.

Also read: Ram Gopal Varma: ఆసక్తికరంగా దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్

Read More