Home> వినోదం
Advertisement

Anupam Kher Workout Video : ముసలోడే కానీ మహానుభావుడు!.. అనుపమ్ ఖేర్ వర్కౌట్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Bollywood Senior Actor Anupam Kher ప్రస్తుతం అనుపమ్ ఖేర్‌కు ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా క్రేజ్ వచ్చేసింది. ఒకప్పుడు బాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతోనే అనుపమ్ ఖేర్ పరిచయమయ్యాడు. కానీ కార్తికేయ 2 సినిమాతో సౌత్‌లోనూ క్రేజ్ దక్కించుకున్నాడు.

Anupam Kher Workout Video : ముసలోడే కానీ మహానుభావుడు!.. అనుపమ్ ఖేర్ వర్కౌట్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Anupam Kher Workout Video ఆరోగ్యమే మహా భాగ్యం అని అంటుంటారు. అలా ఏ వయసు వారైనా సరే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని పద్దతులు పాటించాల్సి ఉంటుంది. వ్యాయామం చేయడం, యోగాను అలవాటు చేసుకోవడం, రన్నింగ్, వాకింగ్ ఇలా ఏదో ఒకి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అనుపమ్ ఖేర్ మాత్రం తన ఓల్డ్ ఏజ్‌లో ఇలాంటి భారీ వర్కౌట్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

అనుపమ్ ఖేర్ ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాతో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యాడు. కొంత మంది అనుపమ్‌ ఖేర్ పోషించిన పాత్ర పట్ల ద్వేషాన్ని ప్రకటించారు. ఇంకొంత మంది అనుపమ్ ఖేర్ పోషించిన కారెక్టర్‌ చూసి కంట్లోంచి నీరు పెట్టేసుకున్నారు. అలా కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా దేశాన్ని ఓ ఊపు ఊపేసింది.

అలా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అనుపమ్ ఖేర్‌కు బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే అనుపమ్ ఖేర్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే కార్తికేయ 2లో అనుపమ్ ఖేర్ పోషించింది ఐదు నిమిషాల పాత్రే అయినా కూడా ఆయన కృష్ణుడి గురించి చెప్పిన మాటలు, ఇచ్చిన ఎలివేషన్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

అలా ఇప్పుడు అనుపమ్‌ ఖేర్‌ను సౌత్‌ మేకర్స్ కూడా తమ సినిమాల్లో పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనుపమ్ ఖేర్ సైతం తన వయసుకు మించిన వర్కౌట్లు చేస్తున్నాడు. కరోనా సమయంలో అనుపమ్‌ ఖేర్ ఫ్యామిలీ ఎంతగా ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అనుపమ్ ఖేర్ తన ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేశాడు.

వర్కౌట్లు మొదలుపెట్టి ఏడాది అయినట్టుంది. అందుకే పాత వీడియోను షేర్ చేసినట్టుగా అనిపిస్తోంది. సండే రోజు మాత్రం వర్కౌట్లు హాలీడే అన్నట్టుగా అనుపమ్ ఖేర్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూస్తే మన తెలుగు వాళ్లు మాత్రం అతడు సినిమాలోని ముసలోడే కానీ మహానుభావుడు అనే డైలాగ్ కొట్టకుండా ఉండలేరేమో.

Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం

Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More