Home> వినోదం
Advertisement

Karan Johar: దక్షిణాది సినిమాలపై కరణ్ జోహార్ వివాదాస్పద వ్యాఖ్యలు

Karan Johar: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సినిమాలపై చేసిన వ్యాఖ్యలు వివాదమౌతున్నాయి. తెలుగు సినీ విమర్శకులు కరణ్ జోహార్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. 

Karan Johar: దక్షిణాది సినిమాలపై కరణ్ జోహార్ వివాదాస్పద వ్యాఖ్యలు

Karan Johar: దక్షిణాది సినీ పరిశ్రమలో మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు ఉత్తరాది సినీ ప్రముఖులు. ఇటీవలి కాలంలో దక్షిణాది సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో  సాకులు చెప్పే ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగానే కరణ్ జోహార్ చేసిన ఈ వ్యాఖ్యలు.

బాలీవుడ్‌లో కరణ్ జోహార్ అందరికీ సుపరిచితుడే. నిర్మాతగా, దర్శకుడిగా అందరికీ కావల్సిన వ్యక్తిగా ఉన్న కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోతో మరింత ప్రాచుర్యం పొందాడు. భారీగా గెస్టుల్ని పిలిచి వివాదాస్పద అంశాల్ని ప్రస్తావించడం కరణ్ జోహార్ షోలో ప్రధానంగా కన్పిస్తుంటుంది. ఈ క్రమంలోనే దక్షిణాది సినిమాలపై విమర్శలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

చెడు హీరోయిజం, పరిమితి దాటిన పురుషాధిక్యంతో వచ్చే సినిమాలు బాలీవుడ్ శైలి కాదని, ఈ వైఖరిని దక్షిణాది నుంచి కొని తెచ్చుకున్నామన్నారు. కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాల విజయం చూసి ఆ తరువాత అలాంటి సినిమాలు నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ ఈ తరహా సినిమాలకు కాపీ కొట్టడం నేర్చుకుందన్నారు. పురుషాధిక్యత, హీరో ప్రధానంగా ఉండే కధల్ని సరైన రీతిలో చూపించేందుకు బాలీవుడ్ కష్టపడుతుంటే దక్షిణాదిలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కరణ్ జోహార్ తెలిపాడు. దక్షిణాది సినిమా అర్జున్ రెడ్డి, దానికి డబ్బింగ్‌గా విడుదలైన కబీర్ సింగ్ బాలీవుడ్‌లో సైతం హిట్టయినా అది తమ శైలి కాదన్నాడు. 

హీరోను విలన్‌లా తప్పుడు విధానాల్లో , తప్పుడు ప్రవర్తనతో చూపించడం తమ పద్ధతి కాదని చెప్పుకొచ్చాడు. కరణ్ జోహార్ దక్షిణాది సినిమాల విజయం చూసి అక్కసులో ఇలా మాట్లాడుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఉత్తరాదిలో దక్షిణాది సినిమాల హక్కుల్ని సాధించి లాభాలు ఆర్జిస్తూనే ఇలా విమర్శలు చేయడంపై అందరూ మండిపడుతున్నారు. 

Also read: Salaar : ఆశ్చర్యపరుస్తున్న సలార్ ఫ్రీ రిలీజ్ బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్లకు పైగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More