Home> వినోదం
Advertisement

Animal Collections: యానిమల్ కలెక్షన్ల హోరు, ఐదురోజుల వసూళ్లు ఎంతంటే

Animal Collections: బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్, రష్మిక మందన్నాలతో తెరకెక్కిన యానిమల్ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ఊచకోత చేస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

Animal Collections: యానిమల్ కలెక్షన్ల హోరు, ఐదురోజుల వసూళ్లు ఎంతంటే

Animal Collections: అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తొలిసారి నేరుగా తీసిని బాలీవుడ్ పాన్ ఇండియా మూవీ యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన యానిమల్ సినిమా ట్రైలర్‌తోనే భారీ అంచనాలు రేపింది. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమా కలెక్షన్ల‌పరంగా కూడా దూసుకుపోతోంది. విడుదలైన తొలి ఐదురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 480 కోట్ల కలెక్షన్లు దాటేసింది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే సెంటిమెంట్ ఆధారంగా పూర్తిగా హింసాత్మకంగా తీసిన సినిమా ఇది. రణబీర్ కపూర్ అంటే బాలీవుడ్‌లో ఇప్పటి వరకూ లవర్ బాయ్‌‌గానే గుర్తింపు ఉంది. అలాంటి నటుడిని యానిమల్‌గా మార్చేశాడు సందీప్ రెడ్డి. 

తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ భారీగానే కలెక్షన్లు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని 15 కోట్లకు దక్కించుకోగా తొలి ఐదు రోజుల్లో యానిమల్ సినిమా 49.10 కోట్లు వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 20.90 కోట్లు, తమిళనాడులో 5.75 కోట్లు, కేరళలో 1.70 కోట్లు వసూలు చేసింది. హిందీలో ఈ సినిమా తొలి ఐదు రోజుల్లో 250 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో 143 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 480 కోట్లు వసూలు చేసేసింది. 

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 1105 కోట్లు, రెండవరోజు 119 కోట్లు, మూడవ రోజు 120 కోట్లు వసూలు చేయగా నాలుగవ రోజు నుంచి కలెక్షన్లు తగ్గాయి. నాలుగోరోజు 68 కోట్లు, ఐదవరోజు 55 కోట్లు వసూళ్లు చేసింది. యానిమల్ సినిమా బ్రేక్ ఈవెన్ 252 కోట్లు కాగా అది ఎప్పుడో దాటేసి లాభాల బాటలో ఉంది. 

Also read: Telangana CM Oath: రేపు రేవంత్ కాకుండా మరో ఆరుగురికే ఛాన్స్, , అసెంబ్లీ తరువాతే పూర్తి స్థాయి కేబినెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More