Home> వినోదం
Advertisement

Annu Kapoor Hospitalised : ప్రముఖ నటుడికి గుండె పోటు.. ప్రస్తుతం ఎలా ఉందంటే?

Annu Kapoor Hospitalised బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అయితే ఆయన హార్ట్ ఎటాక్‌ రావడంతోనే ఇలా ఆస్పత్రి పాలైనట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Annu Kapoor Hospitalised : ప్రముఖ నటుడికి గుండె పోటు.. ప్రస్తుతం ఎలా ఉందంటే?

Annu Kapoor Hospitalised బాలీవుడ్ ప్రముఖ నటుడు, బుల్లితెర ప్రముఖుడు అన్ను కపూర్‌ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. గుండె నొప్పి రావడంతో ఆయన్ను వెంటనే ఢిల్లీలోని సర్ గంగరామ్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉందని, కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

90వ దశకంలో వచ్చిన టీవీ షోలు, సీరియల్స్‌లో ఆయన ఎక్కువగా నటించారు. నాటక రంగంలోనూ ఆయన సుప్రసిద్దులు. టీవీ, రేడియో జాకీ, సినిమాలు ఇలా అన్నింట్లోనూ ఆయన మ్యాజిక్ చేశారు. టీవీ కంటే ముందే సినిమాల్లోనూ నటించాడు. మిస్టర్ ఇండియా, తేజాబ్, రామ్ లంకన్, గయల్, హమ్, డర్ వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించాడు.

విక్కీ డోనార్ సినిమాలో ఆయన పోషించిన డాక్టర్ బల్దేవ్ చద్దా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2021లో వచ్చిన చెహ్రే అనే సినిమాలోనే ఆయన చివరగా నటించారు. మళ్లీ అప్పటి నుంచి ఏ సినిమాలోనూ ఆయన కనిపించలేదు. డ్రీమ్ గర్ల్ 2 అనే సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండేలతో పాటుగా ఈయన కూడా నటించాడు. ఆయుష్మాన్ ఖురానా తండ్రిగా ఆయన నటించారు. అలా ఆయన ఎన్నెన్నో మరుపురాని చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం క్షేమంగానే ఉందని వైద్యులు, కుటుంబ సభ్యులు తెలపడంతో అభిమానులు శాంతించారు.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More