Home> వినోదం
Advertisement

Laal Singh Chaddha: ఆమీర్‌ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చడ్డా' ఓటీటీలోకి వచ్చేసింది... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laal Singh Chaddha: ఆమీర్‌ఖాన్‌, అద్వైత్‌ చందన్‌ కాంబోలో తెరకెక్కిన 'లాల్‌ సింగ్‌ చడ్డా' ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎందులో అంటే..
 

Laal Singh Chaddha: ఆమీర్‌ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చడ్డా' ఓటీటీలోకి వచ్చేసింది... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laal Singh Chaddha OTT Streaming: బాలీవుడ్ స్టార్ ఆమీర్‌ఖాన్‌, కరీనా కపూర్ జంటగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్‌ చడ్డా'(Laal Singh Chaddha). అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కీలకపాత్ర పోషించాడు. ఆగస్టు 11న హిందీ, తెలుగు భాషల్లో రిలీజైన చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈచిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమిర్ ఖాన్కు చివరకు నిరాశే మిగిల్చింది. దాదాపు రూ. 180కోట్లతో వయాకాం 18 స్టూడియోస్‌తో కలసి తన సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. తెలుగులో ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సమర్పికుడిగా వ్యవహారించిన ఫ్యాన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

అయితే ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది ఈ మూవీ. లాల్‌సింగ్‌ చడ్డాడిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీని కోసం రూ.100కోట్లకు పైగా చెల్లించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 'లాల్ సింగ్ చడ్డా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. మీ పాప్‌కార్న్, పానీపూరీలను సిద్ధంగా ఉంచుకోండి' అంటూ  నెట్‌ఫ్లిక్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. థియేటర్ రిలీజైన 6 నెలల తర్వాత సినిమా ఓటీటీలో విడుదలవుతుందని గతంలోనే ఆమిర్ ఖాన్ చెప్పారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఎనిమిది వారాలకే ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. 

Also read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటున్న దిల్ రాజు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More