Home> వినోదం
Advertisement

KGF 2: కేజీఎఫ్ 2 తెలుగు హక్కులు ఎంతకు విక్రయించారో తెలుసా..కొనుగోలు చేసింది అతడే

KGF 2: కేజీఎఫ్ సినిమా గురించి తెలుసు కదా. బ్లాక్ బస్టర్‌గా నిలిచి భారీ వసూళ్లు చేసిన చిత్రం. ఇప్పుడందరి చూపూ కేజీఎఫ్ 2 పై ఉంది. త్వరలో విడుదలకు సిద్ధం కానున్న కేజీఎఫ్ 2 తెలుగు హక్కుల కోసం డిమాండ్ భారీగానే ఉన్నా..దిల్‌రాజు ఒకే ఒక్క సిట్టింగ్‌లో దక్కించుకున్నాడట.
 

KGF 2: కేజీఎఫ్ 2 తెలుగు హక్కులు ఎంతకు విక్రయించారో తెలుసా..కొనుగోలు  చేసింది అతడే

KGF 2: కేజీఎఫ్ సినిమా గురించి తెలుసు కదా. బ్లాక్ బస్టర్‌గా నిలిచి భారీ వసూళ్లు చేసిన చిత్రం. ఇప్పుడందరి చూపూ కేజీఎఫ్ 2 పై ఉంది. త్వరలో విడుదలకు సిద్ధం కానున్న కేజీఎఫ్ 2 తెలుగు హక్కుల కోసం డిమాండ్ భారీగానే ఉన్నా..దిల్‌రాజు ఒకే ఒక్క సిట్టింగ్‌లో దక్కించుకున్నాడట.

తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సంచలనంగా మారిన కేజీఎఫ్ సినిమా( KGF Movie ) గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ వసూళ్ళతో సంచలనం రేపింది. కేజీఎఫ్ దుమ్ము రేపింది కాబట్టే కేజీఎఫ్ 2పై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కేజీఎఫ్ 2 తెలుగు హక్కుల కోసం డిమాండ్ ఎక్కువైంది. నిర్మాతలు అడుగుతున్న ధర చూసి చాలా మంది వెనక్కి తగ్గారు కూడా. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా కావడం, కేజీఎఫ్ 1 దుమ్ము రేపడంతో భారీగానే డిమాండ్ ఉంది. ఇతర భాషల్లో రిలీజ్ చేసుకోదల్చుకున్నవారు భారీగానే పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇతర భాషల్లో రైట్స్‌కు సంబంధించి డీల్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు తెలుగు హక్కుల డీల్ కూడా క్లోజ్ అయింది. 

ఇటీవల కేజీఎఫ్ 2 టీజర్ ( KGF 2 Teaser ) కూడా అంచనాలకు మించి హిట్ అయింది. కేజీఎఫ్ 1 తెలుగు హక్కుల్ని కేవలం 5 కోట్లకు దక్కించుకున్న వారాహి సంస్థ..12 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 ( KGF Chapter 2 )కోసం నిర్మాతలు అడిగింది ఇచ్చుకోలేక వారాహి సంస్థ తప్పుకుంది.  తొలుత కేజీఎఫ్ 2 ధర 50 కోట్లు అనగానే చాలామంది వెనక్కి తగ్గారు. కానీ అసలు ధర 50 కోట్లు కూడా కాదు. ఇంకా ఎక్కువే. 70 కోట్లు పలికింది. దాంతో చాలా మంది ఆశలు వదిలేసుకున్నారు. దిల్‌రాజు ( Dilraju ) మాత్రం వెనక్కి తగ్గకుండా..65 కోట్లకు డీల్ క్లోజ్ చేసినట్టు సమాచారం. మరిప్పుడు దిల్‌రాజు ఏ మేరకు వసూళ్లు రాబడతారో చూడాలి. 

Also read: Chiranjeevi Acharya Shooting: రాజమండ్రిలో చిరంజీవికి అపూర్వ స్వాగతం, ఏజెన్సీ ప్రాంతంలో Acharya Shooting

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More