Home> వినోదం
Advertisement

Bithiri Sathi Controversy: వివాదంలో బిత్తిరి సత్తి.. సైబర్ క్రైమ్ లో కేసు నమోదు..

Bithiri Sathi Controversy: బిత్తిరి సత్తి అలియాస్ చేవేళ్ల రవి వివాదంలో చిక్కుకున్నాడు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతను కించపరిచేలా ఈయన చేసిన వీడియో పై  హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో ఆగ్రహించిన ఈ సంఘాలు బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసారు. 

Bithiri Sathi Controversy: వివాదంలో బిత్తిరి సత్తి.. సైబర్ క్రైమ్ లో  కేసు నమోదు..

Bithiri Sathi Controversy: బిత్తిరి సత్తి.. అలియాస్ ఇస్మార్ట్ సత్తి.. తుపాకి రాముడు అంటూ స్మాల్ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చేవేళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి. జీరో నుంచి మొదలైన ఈయన కెరీర్ ఇపుడు హీరో లెవల్ కు చేరింది. అందుకు ఆయన ఎంతో కష్టనష్టాలను ఓర్చుకొని ఈ స్థాయికి చేరాడు. అయితే.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటాలంటారు. కానీ బిత్తిరి సత్తి.. తన సెలబ్రిటీ ఇమేజ్ ను దుర్వినియోగం చేస్తున్నట్టు తాజాగా ఈయన చేసిన కొన్ని వీడియోలను చూస్తే తెలుస్తుంది. తాజాగా ఈయన భగవద్గీతపై చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా బిత్తిరి సత్తి చేసిన  స్కిట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అటు హిందూ సంఘాలు కూడా ఈ బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని వాళ్లు చెబుతున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ హిందూ సంఘం అయిన రాష్ట్రీయ వానరసేన వాళ్లు ఈ వీడియోపై బిత్తిరి సత్తికి అల్టీమేటం జారీ చేసారు. అంతేకాదు సోషల్ మీడియాలో వీడియోను తెలిగించి హిందూ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు బిత్తిరి సత్తి తన వీడియోలో హిందువులను  కించపరిచేలా లేవని సమర్ధించుకున్నాడు.ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు తనపై ఎలాంటి కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్దమని వాళ్లకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో హిందూ వానర సేన సభ్యులు  సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసారు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More