Home> వినోదం
Advertisement

Bipasha Basu Pregnancy: తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్‌ ఫొటోస్ వైరల్!

Bipasha Basu announce her first pregnancy. తాను తల్లికాబోతున్నాననే విషయాన్ని బిపాషా బసు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 
 

Bipasha Basu Pregnancy: తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్‌ ఫొటోస్ వైరల్!

Bipasha Basu, Karan Singh Grover announce first Child: బాలీవుడ్‌ హాట్ బ్యూటీ బిపాషా బసు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాను తల్లికాబోతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను బిపాషా మంగళవారం (ఆగష్టు 16) పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ సతీమణి బిపాషా బేబీ బంప్‌పై ముద్దుపెడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇటీవల బిపాషా గర్భవతి అంటూ నెట్టింట వార్తలు వినిపించగా.. చివరకు బిప్స్ స్వయంగా అసలు విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

తాను తల్లి అవుతున్న సందర్భంగా బిపాషా బసు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ నోట్‌ పంచుకున్నారు. 'ఇదో కొత్త సమయం, కొత్త దశ, కొత్త అనుభూతి. మా జీవితంలోకి మరింత సంతోషం రానుంది. మేము (బిపాషా-కరణ్‌) ఈ జీవితాన్ని వ్యక్తిగతంగా ప్రారంభించాము. ఒకరినొకరు కలుసుకున్నాము. మా మధ్య ఎంతో ప్రేమ ఉంది. ఇద్దరం కాస్తా ముగ్గురు కాబోతున్నాం. త్వరలోనే మా బిడ్డ మాతో చేరనుంది. మరో అందమైన జీవితాన్ని గడపనున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ, మద్దతు ఎప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని బిప్స్ పేర్కొన్నారు. 

fallbacks

బాలీవుడ్‌ పరిశ్రమలో బిపాషా బసు తనదైన ముద్ర వేశారు. ఢిల్లీలో పుట్టి కోల్‌కతాలో పెరిగిన బిపాషా.. 1996లో గోద్రేజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్‌లో గెలుపొంది మోడల్‌గా రాణించారు. 2001లో 'అజ్‌నబీ' సినిమా ద్వారా సినిమా రంగంలో అడుగు పెట్టారు. 'రాజ్' సినిమాతో పాపులర్ అయ్యారు. ఆ తరువాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. జిస్మ్, కార్పొరేట్, నో ఎంట్రీ, ఫిర్ హేరాఫేరీ, ఆల్ ద బెస్ట్: ఫన్ బిగిన్స్, ధూం 2, రేస్, రాజ్ 3, బచ్‌నా ఏ హసీనో, ఆత్మ, క్రియేచర్ సినిమాల్లో బిపాషా నటించారు. 

fallbacks

ఎలోన్‌ సినిమాలో నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో బిపాషా బసు తొలిసారి జతకట్టారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరు డేటింగ్‌ అనంతరం 2016లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అప్పటినుంచి సినిమాలు తగ్గించిన బిప్స్.. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించారు. తాజాగా బిపాషా-కరణ్‌ తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బిపాషా గతంలో జాన్ అబ్రహంతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. 

Also Read: Jammu Kashmir Accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు జవాన్లు మృతి!

Also Read: Kaushik LM: సినీ పరిశ్రమలో విషాదం.. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More