Home> వినోదం
Advertisement

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో రామ్‌చరణ్‌.. హౌజ్‌మేట్స్‌ను సెట్ చేస్తానన్న నాగ్‌

Ram Charan on BIGG Boss: కింగ్ నాగార్జున వీకెండ్స్‌లలో హౌస్‌మేట్స్‌తో పాటు, ఇటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈసారి ఈ ఎంజాయ్‌మెంట్ డోస్‌ మరింత పెరగనుంది. ఎందుకంటే.......

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో రామ్‌చరణ్‌.. హౌజ్‌మేట్స్‌ను సెట్ చేస్తానన్న నాగ్‌

BiggBossTelugu5 Megapowerstar Ram Charan on the BIGG Boss stage : బిగ్‌బాస్‌ సీజన్‌5 (Bigg Boss Season 5) ఫుల్‌జోష్‌తో ముందుకెళ్తోంది. ఈ సీజన్‌ స్టార్టింగ్‌లోనే మంచి ఫామ్‌లో దూసుకెళ్తోంది. కంటెస్టెంట్‌ల మధ్య పోటీ కూడా రసవత్తరంగా ఉంది. ఇక వీకెండ్‌ ఎపిసోడ్స్ మస్తు మజాగా ఉంటున్నాయి. ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఇస్తున్నారు హౌజ్‌మేట్స్. కింగ్ నాగార్జున (Nagarjuna) వీకెండ్స్‌లలో హౌస్‌మేట్స్‌తో పాటు, ఇటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈసారి ఈ ఎంజాయ్‌మెంట్ డోస్‌ మరింత పెరగనుంది. ఎందుకంటే.. మెగా పవర్‌‌ స్టార్‌‌ రామ్‌చరణ్‌ (Megapowerstar Ram Charan) షోకు వస్తున్నారు. 

గుర్తుపెట్టుకుంటాను

బిగ్‌బాస్‌ స్టేజ్‌పై ఆయన ఎంట్రీ ఇవ్వగానే హౌజ్‌మేట్స్‌ అంతా లేచి నిలబడ్డారు. దీంతో కింగ్.. ఒహో.. నేను గుర్తుపెట్టుకుంటాను... నేను వస్తే ఎవరూ లేవలేదు అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. చెర్రీ తాను లోబోలాగా (Lobo) డ్రెస్‌ చేసుకుని వచ్చానన్నారు. రామ్‌ చరణ్‌ను హౌజ్‌ లోపలకు పంపించండి అంటూ ప్రియ తన మనస్సులోని మాట చెప్పింది.

Also Read : No connection with drugs : తనకూ డ్రగ్స్‌కీ ఎలాంటి సంబంధం లేదన్న KTR‌..ఏ పరీక్షకైనా రెడీ అంటున్న మంత్రి
సెట్‌ చేస్తా

షణ్ముఖ్‌.. చెర్రీకి ఐ లవ్‌ యూ చెప్పాడు. ఈ షణ్నూ ఈ రోజు నీకు చెప్పాడు.. రోజూ దీప్తికి చెప్తాడంటూ నాగ్ కౌంటర్‌‌ వేశాడు. హమీదాను (hamida) ప్రేమించడానికి శ్రీరామ్‌ ప్రయత్నిస్తున్నాడని, కానీ హమీదా మాత్రం ఇప్పటివరకు ఎస్‌ చెప్పలేదన్నారు కింగ్. హౌస్‌మేట్స్‌ అందరి బాగోతాలు తెలుసుకున్నాని.. అందరినీ సెట్‌ చేస్తానని నాగ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ (Bigg Boss Telugu Season 5)..స్టార్టింగ్‌ ఎపిసోడ్స్‌లోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత ఆసక్తికరంగా మారింది. ప్రోమోనే ఇంత బాగా ఆకట్టుకుంటే మరి ఎపిసోడ్ కచ్చితంగా అదిరిపోతదేమో.

 

Also Read : Hanu-Man first look: హనుమాన్ ఫస్ట్ లుక్.. Tollywood నుంచి బాలీవుడ్‌కి మరో ఎపిక్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More