Home> వినోదం
Advertisement

Bigg Boss Telugu 7 Leaked: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత అతడే, రేసులోంచి అవుట్ అయిన శివాజీ

Bigg Boss Telugu 7 Leaked: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఇవాళ జరగనుంది. ఫినాలే జరగడానికి కొద్దిగంటల ముందే విన్నర్ ఎవరనేది లీక్ అయింది. అందరూ ఊహించినదానికి భిన్నంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

Bigg Boss Telugu 7 Leaked: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత అతడే, రేసులోంచి అవుట్ అయిన శివాజీ

Bigg Boss Telugu 7 Leaked: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 చివరి అంకం మిగిలింది. ఇవాళ జరగనున్న గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈలోగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత ఎవరో బయటకు లీకైందని తెలుస్తోంది. టాప్ 6 కంటెస్టెంట్లలో ఆ విజేత ఎవరో తెలుసుకుందాం..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఒక్కటే మిగిలింది. టాప్ 6 కంటెస్టెంట్లుగా ఇప్పుడు బరిలో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్ ఉన్నారు. ఈ ఆరుగురిలో కామన్ మెన్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ చివరి వరకూ బరిలో ఉండటం విశేషం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా శివాజీ నిలుస్తాడనేది హాట్ టాపిక్‌గా ఉంది. కానీ బిగ్‌బాస్ తెలుగు విజేత ఎవరనేది లీక్ అవడంతో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఎవ్వరూ ఊహించని ఫలితాలు లీక్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. గ్రాండ్ ఫినాలే సాయంత్రం జరగాల్సి ఉన్నా, షూట్ ఇప్పటికే పూర్తి కావడంతో విజేత ఎవరనేది లీక్ అయిపోయింది. 

గ్రాండ్ ఫినాలే వారంలో టాప్ 6 కంటెస్టెంట్లుగా నిలిచిన ఆరుగురిలో 6వ కంటెస్టెంట్‌గా అంబటి అర్జున్, 5వ కంటెస్టెంట్గా ప్రియాంక జైన్ నిలిచారని తెలుస్తోంది. ఇక 4వ స్థానంలో ప్రిన్ యావర్ నిలవనున్నాడు. టాప్ 3 కంటెస్టెంట్లలో మిగిలింది పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ. ఇక్కడే ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. శివాజీ 3వ కంటెస్టెంట్‌గా రేసు నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇక మిగిలిన ఇద్దరు పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్ దీప్‌లో విజేత ఎవరనేది చాలావరకూ గోప్యంగానే ఉంచుతున్నారు. 

సామాన్యుడిగా, రైతు బిడ్డగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ చివరి వారం వరకూ చేరాడు. టాప్ 2 కంటెస్టెంట్లలో అమర్ దీప్‌తో పాటు నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అమర్ దీప్ రన్నర్ అని తెలుస్తోంది. అయితే ఇదంతా కేవలం సోషల్ మీడియాలో లీక్ అయిన సమాచారం మాత్రమే. వాస్తవం కావచ్చు. కాకపోవచ్చు. పూర్తి వివరాలు తెలియాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే,

Also read: Bigg Boss 7 Winner: ఈసారి బిగ్‌బాస్ విన్న‌ర్ ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More