Home> వినోదం
Advertisement

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఛాన్స్.. ఇలా చేస్తే లైవ్ లో షో చూడొచ్చు..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 సందడి షూరు కావడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ప్రియులకు నేరుగా ఆటను చూసే అవకాశం కల్పించనున్నారు నిర్వాహకులు. ఎలా అంటే..
 

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఛాన్స్.. ఇలా చేస్తే లైవ్ లో షో చూడొచ్చు..!

Bigg Boss 7 Telugu: తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7కు కౌంట్ డౌన్ స్టార్ అయింది.  ఆరు టీవీ సీజన్స్, ఒక ఓటీటీ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. ఏడో సీజన్ కోసం ముస్తాబైంది. రేపటి (సెప్టెంబరు 3) నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్(Bigg Boss Telugu Season 7) కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహారించనున్నారు. ఈ సీజన్ మిగతా సీజన్లతో పొలిస్తే కాస్త ఢిపరెంట్ గా ఉండబోతుందని ప్రోమోస్ చూస్తేనే అర్థమవుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఇవాళ తేలనుంది.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ ప్రియులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. ఈ షో మూడు నెలలపాటు జరగనుంది. ఒక రోజులో జరిగే విషయాలను కేవలం గంట మాత్రమే ప్రసారం చేస్తారు. బిగ్ బాస్ 6ను 24 గంటలపాటు లైవ్ స్ట్రీమింగ్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‍లో బిగ్ బాస్ 6 అని సెర్చ్ చేస్తే లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ కనిపించేది. ఈసారి అలా చేస్తారో తెలియదు కానీ, బిగ్ బాస్ బజ్ (BiggBossBuzz) మాత్రం ఉంటుందని తెలుస్తోంది.

ఈ బిగ్ బాస్ బజ్ ఫాలో అయ్యేవారికి ఆటను లైవ్‌గా సెట్‍లో చూసే అవకాశం కల్పించనున్నారు మేకర్స్. తాజాగా దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ''ఈసారి ఆట ఆ హౌజ్‍లో మాత్రమే కాదు. మీ హౌజ్‍లో కూడా. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లైవ్‍లో సెట్ నుంచి చూడాలని అనుకుంటున్నారా. అయితే ప్రతిరోజు బిగ్ బాస్ బజ్‍లో మేము అడిగే ప్రశ్నలకు ఫేస్‍బుక్ లైవ్‍లో సరైనా సమాధానం చెప్పిన లక్కీ విన్నర్ వీకెండ్ ఎపిసోడ్‍ను లైవ్ ఆడియెన్స్ గా చూడొచ్చు'' అని వీడియోలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ బజ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం 10, సాయంత్రం 6 గంటలకు స్టార్ మా మ్యూజిక్‍లో బిగ్ బాస్ బజ్ టెలికాస్ట్ కానుంది. 

Also Read: Anushka Upcoming Movie: మలయాళ మూవీలో అనుష్క.. ఏకంగా 14 భాషల్లో రిలీజ్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More