Home> వినోదం
Advertisement

Bigg Boss Telugu 5: ర్యాంకుల కోసం కంటెస్టెంట్ల మధ్య పోటీ..ఎవరికి ఏ పొజిషన్ దక్కిందంటే..

Bigg Boss Telugu 5: టాప్‌-5కు చేరే ఫైనలిస్ట్‌లు ఎవరో ఈ వీకెండ్‌ తేలిపోనుంది. శనివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. 
 

Bigg Boss Telugu 5: ర్యాంకుల కోసం కంటెస్టెంట్ల మధ్య పోటీ..ఎవరికి ఏ పొజిషన్  దక్కిందంటే..

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5(Bigg Boss Telugu 5) చివరి దశకు వచ్చేసింది. ఈ తరుణంలో శనివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో(Latest promo)ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో వ్యాఖ్యాత నాగార్జున హౌస్‌మేట్స్‌తో ‘'వీల్‌ ఆఫ్‌ ది వీక్స్‌'’ పేరుతో ఓ గేమ్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది.  వెనక్కి వెళ్లాల్సిన అవకాశం వస్తే ఎవరు ఏం చేసేవారు? దేన్ని చేయకుండా ఉండేవారు? అన్న ప్రశ్నలను అడిగారు.  ఏ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నారని కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచి మరీ అడిగారు నాగార్జున(Nagarjuna). 

Also Read: Bigg Boss 5: బిగ్‌‌బాస్ 5 విన్నర్ సన్నీ.. కానీ ట్విస్ట్ ఏంటంటే..? సోషల్ మీడియాలో ఫోటో హల్‌చల్

11వ వారంలో తాను చేసిన దానికి బాధపడుతున్నట్లు షణ్ముఖ్‌ చెప్పాడు. అదే విధంగా వెనక్కి వెళ్లే అవకాశం వస్తే తాను అలా చేసుకోనని సిరి(Siri) చెప్పుకొచ్చింది. ఇక హౌస్‌లో హిట్‌ స్టార్‌ ఎవరు? ఫ్లాప్‌ స్టార్‌ ఎవరు? అనే మరో టాస్క్ ను కూడా ఇచ్చినట్లు ప్రోమో  చూస్తే అర్థమవుతోంది. అదే విధంగా హౌస్ లో మీ పొజిషన్ ఏంటో మీరే నిర్ణయించుకోవాలని చాలా సీరియస్ గా చెప్పారు నాగార్జున. దీంతో నెంబర్ 1 స్థానం కోసం కంటెస్టెంట్లు పోటీపడినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఇక టాప్‌-5లో చేరే ఫైనలిస్ట్‌లు ఎవరో ఈ వీకెండ్‌లో తెలిసిపోతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More