Home> వినోదం
Advertisement

Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?

Bigg Boss Telugu 4 contestant Surya Kiran personal life: బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌ ఇటీవలే ప్రారంభమైన నేపథ్యంలో అందులో పాల్గొంటున్న సెలబ్రిటీల పేర్లపై కొనసాగిన సస్పెన్స్ తొలగిపోయింది. కాకపోతే బిగ్ బాస్ 4 కంటెస్టంట్స్‌లో కొంతమంది పెద్దగా వార్తల్లో లేని వ్యక్తులు కావడంతో వారు ఎవరు, ఏంటి అనే వివరాలు ఆడియెన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి.

Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?

Bigg Boss Telugu 4 contestant Surya Kiran personal life: బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌ ఇటీవలే ప్రారంభమైన నేపథ్యంలో అందులో పాల్గొంటున్న సెలబ్రిటీల పేర్లపై కొనసాగిన సస్పెన్స్ తొలగిపోయింది. కాకపోతే బిగ్ బాస్ 4 కంటెస్టంట్స్‌లో కొంతమంది పెద్దగా వార్తల్లో లేని వ్యక్తులు కావడంతో వారు ఎవరు, ఏంటి అనే వివరాలు ఆడియెన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. అలాంటి వారిలో దర్శకుడు సూర్యకిరణ్ ( Director Surya Kiran movies ) కూడా ఒకరు. బిగ్ బాస్ 4వ సీజన్‌లో రెండవ కంటెస్టెంట్‌గా ఎంటరైన దర్శకుడు సూర్య కిరణ్ గురించి కొంతమంది ఆడియెన్స్‌కి ఐడియా లేకపోవడంతో అతడు ఎవరు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. Also read : Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్ 4 షోలో‌కి ఎట్లొచ్చింది ? 

Director Surya Kiran ఎవరు అనే విషయానికొస్తే.. 2003లో సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో ( Satyam movie ) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సూర్య కిరణ్...  ఆ సినిమాతో సుమంత్‌ని మాస్ హీరోగా నిలబెట్టడంతో పాటు తనని తాను దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. అంతకంటే ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన సూర్యకిరణ్.. ఆ తర్వాత సత్యం సినిమాతో ఇలా రచయితగా దర్శకుడిగా మారారు. సత్యం తర్వాత సూర్యకిరణ్ డైరెక్ట్ చేసిన ధన 51 సినిమా ( Dhana 51 movie ) ఫ్లాప్ కాగా ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా తీసిన రాజుభాయ్ ఓ మోస్తరు సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత సూర్యకిరణ్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేకపోవడంతో ఆయనకు, పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అలా సూర్యకిరణ్ పేరు ఈ తరం యువతకు అంతగా పరిచయం లేని పేరైంది. Also read : Gangavva in BB4: బిగ్ బాస్ రియాలిటీ షోలో గంగవ్వ డైలాగ్స్ కెవ్వు కేక

Director Surya Kiran personal life: సూర్య కిరణ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సూర్యకిరణ్ మాజీ భార్య ఎవరో కాదు.. తెలుగు వారికి సుపరిచితురాలైన ప్రముఖ హీరోయిన్ కల్యాణినే ( Actress Kalyani's husband ). ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, పెదబాబు వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి దగ్గరైన కల్యాణి.. సూర్యకిరణ్‌ని పెళ్లి చేసుకున్నారు. ఐతే, పెళ్లి జరిగిన కొంతకాలానికే సూర్య కిరణ్, కళ్యాణి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో ఆ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. Also read : Bangaru Thalli Trailer: ఉత్కంఠరేపుతున్న బంగారు తల్లి ట్రైలర్

విడాకుల ( Actress Kalyani divorced ) తర్వాత కళ్యాణి మళ్లీ ఎప్పటిలాగే అందివచ్చిన సినిమా అవకాశాలకు సైన్ చేస్తూ సినిమాలతో బిజీ అయ్యారు. ఇక సూర్యకిరణ్ ప్రస్తుతం బిగ్ బాస్ 4 తెలుగు విజేతగా ( Bigg boss 4 Telugu winner ) గెలవాలనే ధృడ సంకల్పంతో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్ 4 తెలుగు విజేత అయ్యే అవకాశం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే మరి. Also read : Bigg Boss Telugu Voting: బిగ్ బాస్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓట్లు వేయవచ్చు 

Read More