Home> వినోదం
Advertisement

Bigg Boss 5 Telugu: వామ్మో...శ్వేతావర్మలో ఇంత ఫైర్ ఉందా? రవి దోస్తానాకు దండం పెట్టిన లోబో...

బిగ్ బాస్ లో కంటెస్టెంట్ల మధ్య చిన్న చిన్న  గొడవలు కూడా విశ్వరూపం దాలుస్తాయి. కూల్‌ అనుకునేవారు కూడా కాళికా రూపం ఎత్తే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది తాజా ప్రోమో. ఈ ప్రోమోలో శ్వేతావర్మ విశ్వరూపం ప్రదర్శించింది.
 

Bigg Boss 5 Telugu: వామ్మో...శ్వేతావర్మలో ఇంత ఫైర్ ఉందా? రవి దోస్తానాకు దండం పెట్టిన లోబో...

Bigg Boss 5 Telugu:  బిగ్ బాస్ అంటేనే రచ్చ. తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఈ రచ్చ మామూలుగా లేదు. 18 మంది కంటెస్టెంట్స్ ఎవరికి వారు ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు.  హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి రోజులో సగం మంది వీరలెవల్లో కొట్టుకుంటూనే ఉన్నారు. రెండోవారంలో అయినా ఈ వరస మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అబ్బే ఎక్కడా ఎవరూ తగ్గడం లేదు. 

రెండో వారం ఎలిమినేషన్(Elimination) కోసం నామినేషన్ ప్రాసెస్ సోమవారం ప్రారంభంకానుంది. తాజాగా విడుదలైన  ప్రోమోలో కంటెస్టెంట్ ల మాటల తూటాలతో మోతెక్కినట్టు కనిపిస్తోంది. రెండు టీములుగా విడదీసి.. రంగులు రాసుకొమ్మని చెప్పాడు బిగ్ బాస్(Bigg Boss). అంటే నచ్చని ఇద్దరి మొహానికి రంగు రాయాలి. కారణం చెప్పాలి. తాజా ప్రోమోలో శ్వేతా వర్మ(swetha varma) నోటికి పనిచేప్పినట్టు కనిపిస్తోంది. తోటి కంటెస్టెంట్స్ లో ఒక్కరినీ కూడా వదలకుండా గట్టిగా ఇచ్చి పారేసినట్టుగా ఉంది.

Also Read: BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 నుంచి సరయూ నామినేషన్‌కు కారణాలివే

 ఇక ప్రోమోలో చూపించిన దానిని బట్టి నామినేషన్స్ లో కార్తీకదీపం ఉమాదేవీ, యానీ మాస్టర్, నటరాజ్, ప్రియాంక సింగ్, ప్రియ, ఆర్జే కాజల్, లోబోలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక శ్వేతావర్మ లోబో..హమీదాలను గట్టిగా వేసుకుంది. ఇద్దరినీ ఒక రేంజిలో దుమ్ముదులిపింది. ఎంత కసి మనసులో ఉందొ.. మరి లోబో ఎంత కాని పని చేశాడో ఏమో కానీ, అతనిచ్చిన ఫ్రెండ్షిప్ బాండ్ ను విసిరి నేలకేసి కొట్టి మరీ.. నీ ఫ్రెండ్షిప్ నాకేమీ అవసరం లేదంటూ నిక్కచ్చిగా చెప్పేసి మరీ రంగేసింది. ఇక హమీదాను అయితే, తీవ్రంగా హెచ్చరించిన శ్వేతావర్మ రంగుతో పూర్తిగా మొహాన్ని రుద్దేసింది. ఇక కాజల్(RJ Kajal) కు కూడా గట్టిగానే ఇచ్చింది శ్వేతావర్మ. ఆమె విశ్వరూపం చూస్తే ఒక రేంజిలో కనిపిస్తోంది.

రవికి వార్నింగ్ ఇచ్చిన లోబో..
ఇక తామిద్దరం అన్నా తమ్ముళ్ళం అనుకుంటూ తిరిగిన లోబో(Lobo).. రవి(Anchor Ravi)ల మధ్య నిప్పు పడింది. లోబో రవిని బీభత్సంగా వేసుకున్నాడు. నువ్వు వద్దూ.. నీ స్నేహమూ వద్దు అంటూ దణ్ణం పెట్టిమరీ రంగు పులిమేశాడు. రవి లోబో మాటలకు షాక్ అయినట్టు కనిపించింది. మరోవైపు కార్తీకదీపం ఉమా ఎదో దారుణమైన మాట వదిలినట్టు వినిపించింది. దీంతో షణ్ముఖ్ షాక్ తిన్నాడు. అసలు హౌస్ లో ఈ నామినేషన్ ప్రక్రియలో అందరూ మంచి ఫైర్ మీద ఉన్నట్టు కనిపిస్తోంది ప్రోమోలో.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More