Home> వినోదం
Advertisement

Lucky Lakshman Trailer : ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌ ట్రైల‌ర్‌.. మాస్‌కు ఫుల్ మీల్స్ పెట్టనున్న బిగ్ బాస్ సోహెల్

Lucky Lakshman Trailer లక్కీ లక్ష్మణ్ ట్రైలర్‌ను నిన్న చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో సోహెల్ కామెడీ, ఎమోషనల్ పాత్రలో కనిపించాడు. బిగ్ బాస్ ఇంట్లో సోహెల్ చేసిన సందడి ఇప్పుడు వెండితెరపైనా కనిపించబోతోంది.

Lucky Lakshman Trailer : ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌ ట్రైల‌ర్‌.. మాస్‌కు ఫుల్ మీల్స్ పెట్టనున్న బిగ్ బాస్ సోహెల్

Sohel Lucky Lakshman Trailer బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన సోహైల్‌ ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతోన్నాడు. మోక్ష హీరోయిన్‌గా సోహెల్ హీరోగా వస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. హ‌రిత  గోగినేని ఈ సినిమానుద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై నిర్మిస్తుండగా.. ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రాబోతోంది.  ఈ మూవీ డిసెంబర్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈక్రమంలో ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ట్రైలర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. 

ఈ ట్రైలర్‌లో సోహెల్ అదరగొట్టేశాడు. డబ్బు చుట్టూ తిరిగే పాత్రలో సోహెల్ కనిపించాడు. డబ్బు సంపాదించాలనే ఆలోచనలో తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు. ఇక ప్రేమించిన అమ్మాయిని సైతం బాధపెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్‌తో పాటుగా సందేశం కూడా ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో సోహెల్ ఎనర్జీ మాత్రం కనిపిస్తోంది. సోహెల్ సత్తాను డిసెంబ‌ర్ 30న చూడాల్సిందే. 

 

ట్రైలర్ రిలీజ్ అనంతరం నిర్మాత హ‌రిత గోగినేని మాట్లాడుతూ.. త‌ల్లిదండ్రుల ప్రేమానురాగాలు.. అమ్మాయి ప్రేమ ... ఏదీ త‌క్కువ కాదు. అలాంటి వాటి కంటే డ‌బ్బు గొప్ప‌దా అనే పాయింట్‌ను మా ద‌ర్శ‌కుడు అభి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా రూపంలో  అందంగా తెర‌కెక్కించారని చెప్పుకొచ్చింది. రీసెంటుగా రిలీజైన టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చిందని, ఇప్పుడు ట్రైల‌ర్‌కు కూడా దాన్ని మించిన రేంజ్ రెస్పాన్స్ వ‌స్తుందని సోహెల్ అన్నాడు. ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో న‌వ్విస్తాడు.. మిమ్మ‌ల్ని ప్రేమ‌లో ప‌డేస్తాడు అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

Also Read : Christmas 2022 : క్రిస్మస్ సెలెబ్రేషన్స్.. రష్మిక అలా.. శ్రుతి హాసన్ ఇలా.. సింపుల్‌గా సితార

Also Read : S Thaman TRolling  : విజయ్‌కి ఫ్యాన్‌.. ఎంత మందికి అదే మాట చెబుతావ్.. తమన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More