Home> వినోదం
Advertisement

Bigg Boss Non Stop: బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఊహించని ట్విస్ట్..ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న సరయు

Bigg Boss Non Stop: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి ఎలిమినేషన్ ముగిసింది. ఎవరూ ఊహించనిరీతిలో ముమైత్ ఖాన్ నిష్క్రమించింది. ఎలిమినేషన్ అనంతరం ముమైత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
 

Bigg Boss Non Stop: బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఊహించని ట్విస్ట్..ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న సరయు

Bigg Boss Non Stop: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి ఎలిమినేషన్ ముగిసింది. ఎవరూ ఊహించనిరీతిలో ముమైత్ ఖాన్ నిష్క్రమించింది. ఎలిమినేషన్ అనంతరం ముమైత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ ఈసారి నాన్‌స్టాప్ వెర్షన్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 17 మంది పాత, కొత్త కంటెస్టెంట్లతో కొనసాగుతున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో అప్పుడే వారం గడిచిపోయింది. తొలి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. మొదటి వారం ఎలిమినేషన్ కోసం మిత్ర శర్మ, ఆర్జే చైతు, నటరాజ్, అరియానా, సరయు, హమీదా, ముమైత్ ఖాన్‌లు నామినేట్ కాగా..అనూహ్యంగా ముమైత్ ఖాన్ హౌస్ నుంచి నిష్క్రమించింది. వాస్తవానికి తొలి వారం ఎలిమినేట్ అయ్యేది మిత్ర శర్మగా మెజార్టీ ప్రేక్షకులు ఊహించారు. 

గత సీజన్‌లో మొదటి వారమే హౌస్ నుంచి నిష్క్రమించిన సరయుకు ఈసారి కూడా ఇంచుమించు అదే పరిస్థితి తలెత్తింది. ఎలిమినేషన్ ప్రక్రియలో ముమైత్‌తో కలిసి చివరివరకూ వచ్చింది. ముమైత్ ఖాన్‌తో పోలిస్తే కొద్దిపాటి ఓట్ల తేడా ఉండటంతో తృటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. వాస్తవానికి చివరి వరకూ సరయూ, మిత్రశ్రర్మ ఉంటారనేది అంచనా. కానీ అందుకు భిన్నంగా మిత్ర శర్మ స్థానంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇక హౌస్ నుంచి బయటికొచ్చాక..ముమైత్ ఖాన్ కన్నీటిపర్యంతమైంది. అందరూ కావాలనే తనను బ్యాడ్ చేశారని చెప్పుకొచ్చింది. కొందరిపై నేరుగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఎలిమినేషన్ అనంతరం ఉండే వర్తీ, వేస్ట్ ట్యాగ్‌లు ఎవరికని ప్రశ్నించినప్పుడు..ఏకంగా అఖిల్, అజయ్, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్ ఇవ్వగా..సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతుల్ని వేస్ట్ అనేసింది.

Also read: Web Series Hot Scenes: వరుసగా మూడు వెబ్‌సిరీస్‌లలో హాట్ సీన్స్‌తో రెచ్చిపోయిన ఆ నటి ఎవరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More