Home> వినోదం
Advertisement

Sohel Mr Pregnant: ఆసక్తి రేకెత్తిస్తున్న సొహెల్ 'మిస్టర్ ప్రెగ్నెంట్' ట్రైలర్

Sohel Mr Pregnant: బిగ్ బాస్ ఫేమ్ సొహెల్ నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేయండి మరి. 
 

Sohel Mr Pregnant: ఆసక్తి రేకెత్తిస్తున్న సొహెల్ 'మిస్టర్ ప్రెగ్నెంట్' ట్రైలర్

Sohel Mr Pregnant trailer: బిగ్ బాస్ ఫేమ్ సొహెల్(Sohel) లేటెస్ట్ సినిమా 'మిస్టర్ ప్రెగ్నెంట్'(Mr Pregnant trailer). ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ హీరో నాగార్జున విడుదల చేశారు. ఈ ట్రైలర్ మెుత్తం ఫన్ అండ్ ఎమోషన్స్ తో సాగుతోంది. ఓ మగాడు గర్బం దాలిస్తే.. అతడు ఎలాంటి అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ లో చూపించారు. 

'నా పేరు గౌతమ్. నాది మంచి క్రేజీ లైఫ్.. ఓ క్రేజీ గర్ల్ ఫ్రెండ్' అంటూ సొహెల్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మెుదలవుతుంది. ఆ తర్వాత ఇది అందరి లైఫ్ లో ఉండేదే బ్రో.. కానీ నా లైఫ్ లో ఓ ట్విస్ట్ అంటూ సోహెల్ గర్బం దాల్చడం, దాంతో అతడు ఎదుర్కొన్న అనుమానాలను, ప్రాబ్లమ్స్ ను ఈ ట్రైలర్ లో చూపించారు. చివర్లో బిడ్డ కోసం సొహెల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో సుహాసిని, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, అలీ, అభిషేక్ రెడ్డి, వైవా హర్ష, స్వప్నిక తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పనిచేశారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. 

Also Read: Game Changer Songs: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సాంగ్స్ కోసమే రూ.90 కోట్లా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More