Home> వినోదం
Advertisement

Bigg Boss - Solo Boy: హీరోగా మారిన మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్..

Bigg Boss - Gutam Krishna: తెలుగులో బిగ్‌బాస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆయా కంటెస్టెంట్స్ కొన్ని రోజులు పాటు లైమ్‌లైట్‌లో ఉంటారు. ఈ అవకాశాన్నే వాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. ఈ కోవలో ఎంతో మంది బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ హీరోలుగా తమ లక్ పరీక్షించుకున్నారు. తాజాగా గౌతమ్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Bigg Boss - Solo Boy: హీరోగా మారిన మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్..

Bigg Boss - Gutam Krishna: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హౌస్‌లో అందరిక కలివిడిగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను కూడా పూర్తి చేసేవాడు. తాజాగా ఈయన హీరోగా 'సోలో బాయ్' అనే సినిమా తెరకెక్కుతోంది.  సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చసాడు. పి. నవీన్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.  

ఈ సందర్భంగా నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్  మాట్లాడుతూ - కరోనా సమయంలో నేను బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశాను. కోవిడ్ పాండమిక్ టైం లో ఓటిటి ద్వారా ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. ఆ తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే  ఈ స్టోరీ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటి యూత్  ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. వాళ్లకు  కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఈ సినిమాలో ఉన్నాయి. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో గౌతమ్ మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు. గతంలో ఆకాశవీధిలో సినిమాతో అలాగే బిగ్ బాస్ 7 లో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. ఇప్పుడు సోలో బాయ్ సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చామన్నారు. త్వరలో టీజర్, ట్రైలర్ తో మీ ముందుకు వస్తామని చెప్పారు. సో ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.

హీరో గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్ ఫేమ్ మాట్లాడుతూ.. గతంలో ఆకాశవీధిలో చేసినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. తర్వాత వేరే స్టోరీలు వింటున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. ఈ రోజు మా సినిమా "సోలో బాయ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేసారు.  ముందు ముందు టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ తో కొత్తగా మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మా సినిమా అనుకున్న దానికంటే బాగా తెరకెక్కింది. ఈ సినిమా చేస్తూ చేస్తూ మేమూ మూవీతో కనెక్ట్ అయిపోయాము. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్ట్ ఉంది. మంచి సినిమాలను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. గతంలో ఆకాశవీధిలో, బిగ్ బాస్ తో ఎలా అయితే ఆదరించారో ఇప్పుడీ మూవీతో కూడా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు నవీన్ కుమార్  మాట్లాడుతూ - యూత్ కి ఫామిలీ ఆడియన్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ ప్రేక్షకుల మెప్పు పొందుతుందున్నారు.
ఈ మూవీ నటీనటుల విషయానికొస్తే.. గౌతమ్ కృష్ణతో పాటు శ్వేతా అవస్తి, రమ్య పసుపులటి, పోసాని కృష్ణమురళి తదితరలు ఇతర తారాగణం.

Also read: Ananya Panday: అందాల తూనీగలా అనన్య పాండే, లేటెస్ట్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More