Home> వినోదం
Advertisement

Bigg Boss Akhil : ఈ అబద్దపు ప్రపంచంలో ఇకపై ఉండను.. గుడ్ బై.. అఖిల్ పోస్ట్‌తో అనుమానాలు

Akhil Sarthak Quits Social Media బిగ్ బాస్ షోతో అఖిల్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ అఖిల్‌కు చాన్స్ వచ్చింది. అలా వచ్చిన చాన్స్‌ను కూడా అఖిల్ సరిగ్గా వాడుకోలేకపోయాడు. టీవీ, ఓటీటీల్లోనూ అఖిల్ రన్నర్‌గానే నిలిచాడు.

Bigg Boss Akhil : ఈ అబద్దపు ప్రపంచంలో ఇకపై ఉండను.. గుడ్ బై.. అఖిల్ పోస్ట్‌తో అనుమానాలు

Akhil Sarthak Quits Social Media బిగ్ బాస్ రన్నర్ అఖిల్ ప్రస్తుతం ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇదంతా ఫేక్ ప్రపంచం అని అనేశాడు. ఇన్ స్టాగ్రాం అనేది ఫేక్ వరల్డ్, అన్ రియల్ వరల్డ్ అంటూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. అయితే తనకు మనశ్శాంతి కావాలని, అదే తనకు ముఖ్యమని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇకపై తాను సోషల్ మీడియాలకు, ఇన్ స్టాకు దూరంగా ఉంటానని తెలిపాడు.

అసలే అఖిల్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. బీబీ జోడిలో తేజస్వీతో కలిసి అఖిల్ హంగామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అఖిల్ ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా, ఇన్ స్టాగ్రాం ఇలా అన్నింటి నుంచి బ్రేక్ తీసుకుంటున్నా.. మళ్లీ కొన్ని రోజుల తరువాత తిరిగి వస్తాను అని చెప్పుకొచ్చాడు.

నా ఫాలోవర్లను హ్యాపీగా ఉంచేందుకు ఇన్ స్టాలో స్టోరీలు పెడుతుంటాం.. సంతోషంగా లేకపోతే కూడా సంతోషంగా లేనని చెబుతా.. నేను హ్యాపీగా లేని రోజుల్లో కూడా ఇన్ స్టాలో హ్యాపీగా ఉన్నట్టుగా పోస్ట్‌లు పెట్టాను.. కానీ ఇకపై నేను ఇలా మ్యానేజ్ చేయలేను..  మనం ఇలా రియాల్టీని దాచి పెట్టడకూడదు.. నిజాలు  చెప్పాలి.. 

fallbacks

కొన్ని రోజులు ఏ పని చేయకపోయినా పర్లేదు.. నాకు ఏం కాదు.. నాకు కావాల్సింది మనశ్శాంతి.. ఇప్పటి నుంచి నా ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాగ్రాంలో షేర్ చేయను.. బ్రాండ్ కమిట్మెంట్లకు సంబంధించిన వీడియోలను నా టీం పోస్ట్ చేస్తుంది.. కొన్ని రోజులు ఈ అవాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను అంటూ అఖిల్ పోస్ట్ వేశాడు.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అఖిల్ మోనాల్ ట్రాక్, ఓటీటీలో బిందు మాధవి అఖిల్ గొడవలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత అఖిల్ మోనాల్‌లు సోషల్ మీడియాలో ఎంతగా హంగామా చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసిన వెబ్ సిరీస్ సంగతి ఎవ్వరికీ తెలియకుండానే పోయింది.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More