Home> వినోదం
Advertisement

BB 7 Telugu latest Promo: అమర్ చెత్త రీజన్.. కంటతడి పెట్టిన శివాజీ..

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 07లో తన ఆట, తెలివితో దూసుకుపోతున్న కంటెస్టెంట్లలో హీరో శివాజీ ఒకరు. తాజాగా శివాజీ ఎమోషనల్ అయ్యారు. తనలోని బాధను బిగ్ బాస్ తో చెప్పుకుని ఏడ్చారు.
 

BB 7 Telugu latest Promo: అమర్ చెత్త రీజన్.. కంటతడి పెట్టిన శివాజీ..

Bigg Boss 7 Telugu latest Promo: బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం కెప్టెన్సీ కోసం తెగ కష్టపడుతున్నారు కంటెస్టెంట్స్. ఇప్పటికే పల్లవి ప్రశాంత్, యావర్ కెప్టెన్స్ ఎంపిక కాగా.. ఈ వారం ఎవరు అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఫ్లోట్ ఆర్ సింక్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో ఎవరు కెప్టెన్ కంటెండర్ కు అనర్హులు కాదో.. వారి ఫోటోను కంటెస్టెంట్స్ నీటిలో పడేయాలని పెద్దయ్య చెప్పాడు. దీంతో శోభా శెట్టి  అశ్వినీ ఫోటోను, పూజా మూర్తి ప్రశాంత్ ఫోటోను, యావర్ ప్రియాంక ఫోటోను, అమర్ శివాజీ ఫోటోను నీటిలో పడేస్తారు. ఈ క్రమంలో శివాజీ, అమర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతుంది. తాను కెప్టెన్సీకి ఎందుకు అనర్హుడని కాదో చెప్పాలని అమర్ ను శివాజీ అడుగుతాడు.  శివాజీ కంటే కష్టపడి ఆడిన వారు ఉన్నారని కాబట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అమర్ చెప్తాడు. దీంతో శివాజీ చాలా బాధపడతాడు. 

ఆ తర్వాత శివాజీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కు పిలుస్తాడు. ఎలా ఉన్నారని అడుగుతాడు పెద్దయ్య. "చాలా ఇబ్బంది పడుతున్నా బిగ్‍బాస్. చేయింతా లాగుతోంది. నొప్పిగా ఉంది. ఎవరూ లేకుంటే నేనే ఏడుస్తున్నా. ఎవరన్నా ఉంటే నవ్వుతూ లోలోపల ఏడుస్తున్నా. వాళ్లందరి ముందు ఏడ్వలేకపోతున్నాను. చాలా బరువుగా ఉంది'' అంటూ ఎమోషనల్‍గా మాట్లాడతారు శివాజీ. నువ్వు ఆడటం లేదు అని అమర్ అనడంతో శివాజీ బాగా హార్ట్ అయ్యారు. ఇదే బాధను బిగ్ బాస్ తో పంచుకున్నాడు ఈ హీరో. కెప్టెన్సీ రేసులో ఎవరు నిలిచారు, శివాజీ బాధపడటానికి కారణం ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

Also Read: BB 7 Elimination: ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్.. డేంజర్ జోన్ లో సీరియల్ నటి..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More