Home> వినోదం
Advertisement

BB 7 Updates: వామ్మో.. బిగ్ బాస్ మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు.. శివాజీ ఈజ్‌ బ్యాక్‌..

BB 7 Updates: ముందుగా చెప్పిన విధంగానే ఉల్టా పుల్టాగా సాగుతోంది బిగ్ బాస్. శివాజీని హౌస్ నుంచి పంపించేసినట్లు ప్రోమోలో చూపించారు బిగ్ బాస్. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. అసలు ఏం జరిగిందంటే?
 

BB 7 Updates: వామ్మో.. బిగ్ బాస్ మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు.. శివాజీ ఈజ్‌ బ్యాక్‌..

Bigg Boss 7 Telugu latest Promo: బిగ్ బాస్ ట్విస్టులపై ట్విస్టులు ఇస్తూ షోను రక్తి కట్టిస్తున్నారు మేకర్స్. ఇప్పడు ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది బిగ్ బాస్. ఆదివారం ఊహించని విధంగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది నయని పావని. ముందుగా చెప్పిన విధంగానే ఉల్టా పుల్టాగా సాగుతోంది ఈ సీజన్. అయితే ఆదివారం నాటి ఎపిసోడ్ తర్వాత సోమవారం ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని ప్రోమోలను రిలీజ్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఈ ప్రోమోలో శివాజీ హౌస్ నుంచి వెళ్లిపోతున్నట్లు చూపించారు. దీంతో హౌస్ మేట్స్ తోపాటు ఆడియెన్స్ కూడా షాక్ తిన్నారు. 

ఆదివారం రాత్రి నుంచి దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈరోజు ఉదయం నుంచి శివాజీ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.  అయితే టాప్ కంటెస్టెంట్ ను సడన్ గా పంపించడాన్ని ఎవరూ నమ్మలేదు. అయితే ఇదంతా బిగ్ బాస్ ఆడుతున్న డ్రామా అని కొంత మంది నమ్మారు. హెల్త్ రీజన్స్ వెళ్లి శివాజీని పంపించేసి ఉంటారని మరికొంత మంది భావించారు. అయితే షోను రక్తికట్టించడానికే బిగ్ బాస్ ఇలా చేశాడని నెక్ట్స్ ప్రోమోలో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అయితే శివాజీ మళ్లీ హౌస్ లో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 

శివాజీ కొన్ని రోజులుగా చెయ్యి, వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అయినా ఫిజికల్‌ టాస్కులు, గేమ్స్‌లో కూడా బాగానే పాల్గొంటున్నాడు. అయితే ఈ నొప్పి ఎక్కువవ్వడంతో శివాజీకి మెడికల్‌ ట్రీట్‌మెంట్ ఇప్పించాలని బిగ్‌బాస్‌ నిర్ణయించాడట. అందుకే ఆయనను హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స చేయించాలనుకున్నారట బిగ్ బాస్. అందుకే షోని రక్తికట్టించడం కోసం శివాజీని ఎలిమినేట్‌ చేస్తున్నట్లు డ్రామా ఆడాడు బిగ్‌బాస్‌.

Also Read: Extra Ordinary Man: నితిన్‌ నయా మూవీలో యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More