Home> వినోదం
Advertisement

Geetu Vs Baladitya : బాలాదిత్య ఏడుపు.. గీతూ శునకానందం.. శాడిస్ట్ సైకోలా కంటెస్టెంట్

Bigg Boss 6 Telugu 9th Week Captaincy Task బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం మరో పెద్ద గొడవే జరిగేట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా అసలు రూపాలు మరింతగా బయటకు వచ్చేట్టు కనిపిస్తోంది. గీతూ ఎంత శాడిస్ట్ అన్నది మరోసారి ఫ్రూవ్ కానుంది.

Geetu Vs Baladitya : బాలాదిత్య ఏడుపు.. గీతూ శునకానందం.. శాడిస్ట్ సైకోలా కంటెస్టెంట్

Geetu Vs Baladitya : బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ రోజురోజుకూ దిగజారిపోతోంది. పక్క వారి ఆటలను విశ్లేషిస్తోంది. కానీ తన స్థాయి ఏంటన్నది తాను చూసుకోలేకపోతోంది. బాలాదిత్య చాలా మంచివాడని ఎంత త్వరగా ఎలిమినేట్ అయి పోతే అంత మంచింది అంటూ గీతూ చెప్పింది. రేవంత్ కూడా అంతే.. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది.. అంటూ రివ్యూలు ఇచ్చింది. కానీ గీతూ తన ఆటను రివ్యూ చేసుకోలేకేపోతోంది. తనంత వాళ్లు లేరని, తనే తోపు కంటెస్టెంట్ అని, తనకు మాత్రమే తెలివి ఉందని, తనే గేమర్ అనే భ్రమలో బతికేస్తోంది.

కానీ గీతూకి బయట ఉన్న ఇమేజ్ గురించి, నెగెటివిటీ గురించి తెలుసుకోలేకపోతోంది. తన పేరు గీతూ.. కాదు గీథూగా మారిపోయిందని తెలుసుకోలేకపోతోంది. తన రాక్షసత్వాన్ని, శాడిజనాన్ని, సైకోయిజాన్ని చూపించి అదే తెలివి, బుద్దిబలం అని అనుకుంటోందేమో. బాలా అన్న అంటూ ప్రేమగా పిలిచే గీతూ.. ఆ బాలాదిత్యకు మండేట్టు చేసింది. విల విల కొట్టేసుకునేలా చేసింది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ రసవత్తరంగా మార్చాడు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ ఇలా అంతా ఒకే బ్యాచులో పడేశాడు. శారీరక బలాన్నే కాకుండా బుద్ది బలం కూడా వాడతారని బిగ్ బాస్ ఆశిస్తున్నాడు అనే పాయింట్‌ను గీతూ నొక్కి చదివింది. అంటే తనకు మాత్రమే తెలివి ఉందని మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో అవతలి కంటెస్టెంట్ల వీక్ పాయింట్ మీద కొట్టేద్దామని మరో చెత్త సలహా ఇచ్చింది. గత వారం ఇలానే వీక్ పాయింట్ల మీద కొట్టి ఆడేద్దామని అనుకుని బొక్క బోర్లా పడింది. అయినా బుద్దిరాని, బుద్దిలేని, బుద్ది తెచ్చుకోలేని గీతూ.. కుక్క తోక వంకర అన్నట్టుగానే చేసింది.

 

బాలాదిత్యకు సిగరెట్లు లేకపోతే ఉండలేడని తెలుసు. ఆ వీక్ పాయింట్ మీద కొట్టేశారు. లైటర్, సిగరెట్లు దాచేశారు రేవంత్, గీతూ. ఇక బాలాదిత్య ఎంతగానో వేడుకున్నాడు. కానీ ఇచ్చేందుకు అంగీకరించలేదు. రెండు స్ట్రిప్స్ ఇస్తానంటే లైటర్, సిగరెట్ ఇస్తానంటూ గీతూ బేరమాడింది. ఆడితే నేరుగా ఆడి గెలవండిరా.. ఇది చాలా చీప్.. అని బాలాదిత్య ఆవేదన వ్యక్తం చేశాడు. అవును నేను  చీప్ అన్నట్టుగా గీతూ వ్యవహరించింది. ఇక బాలాదిత్య ఏడుస్తూ అరుస్తుంటే.. గీతూ మాత్రం తెగ సంబరపడిపోయింది. సైకో శాడిస్ట్‌కు ప్రతిరూపంగా నిలిచినట్టుంది గీతూ.

ఊరంతా దాన్ని నమ్మొద్దు అని చెప్పినా.. పక్కనే పెట్టుకున్నానంటూ బాలాదిత్య అరుస్తూ ఉండిపోయాడు. సిగరెట్ లేకపోవడంతో బాలాదిత్య ప్రాణం విలవిల్లాడిపోయినట్టుంది. ఈ ఎపిసోడ్‌తో మరోసారి గీతూ ఖాతాలో మోయలేనంత, చెరుపుకోలేనంత నెగెటివిటీ వచ్చేస్తుందనిపిస్తోంది. మరి ప్రోమోలో ఇలా ఉంది గానీ ఎపిసోడ్‌లో కంటెంటె ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : Jabardasth Emmanuel New Car : కారు కొన్న జబర్దస్త్ ఇమాన్యుయేల్.. పక్కన మాత్రం వర్ష కాకుండా ఆ బ్యూటీ

Also Read : Bigg Boss Faima : ఫైమాకు మూడింది.. వెటకారం మరీ ఎక్కువైంది.. ఈ వారం బయటకు వచ్చేస్తుందోచ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More