Home> వినోదం
Advertisement

Bigg Boss Geetu - Sri Satya : ఊసరవెల్లి గీతూ.. ఎగిరిపడుతున్న సత్య.. ఈ వారం మూడేది ఎవరికి?

Bigg Boss 6 Telugu 9thweek Capataincy Task బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇందులో గీతూ, సత్యలు తమ తమ క్రూరత్వాన్ని చూపుతున్నారు.
 

Bigg Boss Geetu - Sri Satya : ఊసరవెల్లి గీతూ.. ఎగిరిపడుతున్న సత్య.. ఈ వారం మూడేది ఎవరికి?

Bigg Boss Geetu - Sri Satya : బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్‌లోనే రచ్చ రచ్చగా జరిగింది. ఫైమా తన వెటకారంతో ఇమేజ్ దిగజార్చుకుంది. శ్రీహాన్ తన పిచ్చి చేష్టలు, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో తన మీద ఉండే ఇంప్రెషన్ పోగొట్టుకుంటున్నాడు. ఇలా నామినేషన్స్ ఓ రకంగా జరిగితే.. తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ ఇంకోలా జరుగుతోంది. ఈ టాస్కులో ఒక్కొక్కరి స్వరూపాలు ఏంటో అందరికీ తెలుస్తోన్నాయి. ఇంకా ఇంకా నీచానికి దిగుతున్నట్టుగా అనిపిస్తోంది.

మిషన్ పాజిబుల్ టాస్క్, బ్లూ టీం, రెడ్ టీం అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ప్రతీ కంటెస్టెంట్‌కు భుజాల మీద స్ట్రిప్స్ ఉంటాయి. వాటిని పీకేస్తే ఆ కంటెస్టెంట్ ఆటలోంచి బయటకు వచ్చినట్టు. రేవంత్, గీతూ, సత్య, శ్రీహాన్, ఫైమా ఇలా వీరంతా ఒక టీంలా ఉన్నారు. అయితే మొదటి బజర్ మోగిన సమయంలో గ్రెనైడ్ పట్టుకునే పనిలో గీతూ టీం ఉంటే.. ఫైమాను పట్టుకుని స్ట్రిప్స్ లాగే ప్రయత్నంలో అవతలి టీం ఉంది. అందులో ఆదిరెడ్డి, రాజ్, బాలాదిత్య, వాసంతి, మెరినా, రోహిత్ ఇలా అందరూ ఉన్నారు.

చివరకు ఫైమా స్ట్రిప్స్ తీసేశారు. ఆటలోంచి తప్పించేశారు. ఇదంతా ఇలా సాగుతూ ఉంది. కానీ కన్నింగ్ గీతూ, సత్య ఇద్దరూ వీక్నెస్‌ల మీద కొట్టేందుకు ట్రై చేశారు. వీరికి శ్రీహాన్ సాయం చేశాడు. బాలాదిత్య సిగరెట్లు, లైటర్ దాచి పెట్టారు. ఎంత బతిమిలాడినా ఇవ్వలేదు. చివరకు బాలాదిత్య ఆటలోంచి అవుట్ అయినా కూడా సిగరెట్, లైటర్ ఇచ్చేందుకు గీతూ ఒప్పుకోలేదు. దీంతో ఆదిత్య బరస్ట్ అయ్యాడు. నిన్ను చెల్లి అని పిలిచినందుకు బాధపడుతున్నా.. సిగ్గుందా? మనిషివేనా? అంటూ ఇలా చాలా మాటలు అనేశాడు.

అయినా గీతూ మాత్రం సిగరెట్, లైటర్ ఇవ్వలేదు. ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం ఇంత దిగజారుతావా? అంటూ బాలాదిత్య ఏడ్చేశాడు. ఆఫ్ట్రాల్ కదా? వదిలేయ్ అయితే అని గీతూ మొండి పట్టు పట్టేసింది. అక్కడ అంతలా ఓవర్ యాక్షన్ చేసిన గీతూ.. ఆదిరెడ్డి వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కార్చేసింది. నువ్ కూడా అలా అంటావా? ఆదిరెడ్డి.. సిట్యువేషన్ చూసి అంటావా? తట్టుకోలేను ఆదిరెడ్డి అని ఏడ్చేసింది గీతూ. ఇలా గీతూకి వస్తే ఎమోషన్.. వేరే వాళ్లకు వస్తే మాత్రం ఎమోషన్ కాదు. గీతూ తనది మాత్రం రైట్ అనే భ్రమలో బతికేస్తుంటుంది. ఇలా గీతూ ఊసరవెల్లిలా చేస్తోంది.

ఇక సత్య అయితే ఇనయను పదే పదే ఫ్రెండ్‌కు వెన్ను పోటు పొడిచావ్ అని అంటోంది. మరి సత్య.. అర్జున్ విషయంలో చేసింది మాత్రం గుర్తుకు తెచ్చుకోలేకపోతోంది. అర్జున్‌ని కూడా సత్య అలానే వాడుకుంది. పాపం అర్జున్ అయితే సత్య కోసం ఎన్నో చేశాడు. కానీ సత్య మాత్రం ఏనాడూ అర్జున్‌ కోసం ఏమీ చేయలేదు. కనీసం ఓ మంచి ఫ్రెండ్‌లా కూడా అర్జున్‌ని చూడలేదు సత్య. ఈ వారం సత్య కాస్త ఎగిరిపడుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లా చాలా నీచంగా వ్యవహరించింది. వంకరటింకరలు తిరుగుతూ, ఇనయను ఇమిటేట్ చేసింది. అలా చేయడంతో సత్య పది మెట్లు కిందకు పడిపోయినట్టుగా అనిపించింది. ఈ వారం మాత్రం సత్య, ఫైమా, గీతూల్లో ఎవరో ఒకరు బయటకు వెళ్లేలా కనిపిస్తోంది.

Also Read : Actress Rambha Live Video : మొదటి సారి లైవ్‌లోకి వచ్చా.. అందరికీ రుణపడి ఉంటా.. రంభ ఎమోషనల్ వీడియో

Also Read : UV Productions GST Raids: ప్రభాస్ సొంత సంస్థపై జీఎస్టీ రైడ్స్.. టాలీవుడ్లో కలకలం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More