Home> వినోదం
Advertisement

Bigg Boss 6 Nominations : బిగ్ బాస్ ఐదో వారం నామినేషన్ లిస్ట్.. విడిపోనున్న జంట?

Bigg Boss 6 Telugu 5th Week Nomination బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం నామినేషన్ ప్రక్రియతో అందరినీ ఇరికించేశాడు. ఇద్దరిద్దరినీ జంటలుగా చేసిన బిగ్ బాస్.. అందులోంచి ఎవరో ఒకరిని నామినేట్ అవ్వమని, ఇంకొకరిని సేవ్ అవ్వమని చెప్పుకొచ్చేశాడు.

Bigg Boss 6 Nominations : బిగ్ బాస్ ఐదో వారం నామినేషన్ లిస్ట్.. విడిపోనున్న జంట?

Bigg Boss 6 Telugu 5th Week Nomination : బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం నామినేషన్ ప్రక్రియ హీటెక్కేలా ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లో నాలుగు వారాలు గడిచాయి. నలుగురు కంటెస్టెంట్లు బయటకు వచ్చేశారు. షానీ, అభినయ, నేహా, ఆరోహి ఎలిమినేట్ అయ్యారు. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆరోహి ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆరోహి తరువాత బయటకు వెళ్లే కంటెస్టెంట్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఈ నామినేషన్ ప్రక్రియ ప్రసారం కానుంది. ఈ సారి ఇంటి సభ్యుల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్.

ప్రతీ సీజన్లో ఉన్న మాదిరిగానే.. ఈ సీజన్లోనూ నామినేషన్ ప్రాసెస్ ఉంది. ఇద్దరిద్దరినీ ఓ జట్టుగా చేస్తారు.. అందులో ఎవరు నామినేట్ అవ్వాలి.. ఎవరు సేవ్ అవ్వాలని వాగ్వాదించుకోవాలి. చివరకు ఎవరో ఒకరు తగ్గాలి.. ఒకరు నెగ్గాలి.. ఒక వేళ ఎంత వరకూ వ్యవహారం తెగకపోతే.. ఇద్దరూ నామినేట్ అవుతుంటారు. ఇలా ఓ సారి జరిగింది కూడా. అయితే ఇప్పుడు ఈ ఆరో సీజన్ కోసం ఐదో వారంలో ఇలాంటి ఓ నామినేషన్ ప్రక్రియనే బిగ్ బాస్ తన కంటెస్టెంట్ల ముందుంచాడు.

 

మెరినా రోహిత్ ఇంత వరకు జంటగా ఆడారు. నామినేట్ చేసినా, నామినేట్ అయినా కూడా జంటగానే అయ్యాఉ. కానీ ఈ సారి మాత్రం కాస్త పద్దతి మార్చాడు. ఇకపై జంటగా ఆడటానికి వీల్లేదని, ఎవరికి వారే ఆడాలని ఆదేశించాడు. దీంతో మెరినా రోహిత్‌లకు సంకెళ్లు వేశారు. ఎవరో ఒకరు రిలీజ్ అవ్వాలని, ఇంకొకరు నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో మెరినా కాస్త తగ్గింది. తన భర్త ఈ ఇంట్లో ఉండాలని కోరుకుంది. తాను లేకపోయినా.. తన భర్త ఉండాలని త్యాగం చేసింది. అలా మెరినా నామినేట్ అయింది.

అయితే అర్జున్ సత్యలను ఓ జట్టుగా చేశాడు బిగ్ బాస్. సత్య కోసం అర్జున్ చాలానే చేశాడు. గత వారం అర్జున్ తన వద్ద ఉన్న డబ్బంతా ఆమెకే ఇచ్చాడు. ఆమె కోసమే ఆడాడు. అయితే అదే విషయాన్ని ప్రస్థావించి.. ఈ వారం తన కోసం నామినేట్ అవ్వమని అర్జున్ అడిగాడు. కానీ సత్య ఒప్పుకోలేదు. అది నీ కోసం నువ్ ఆడావ్.. సేవలు చేయించుకున్నావ్ కదా? నేను నామినేట్ అవ్వను అని మొహం మీదే చెప్పేసింది. 

నువ్ నామినేట్ అయినా కూడా సేవ్ అవుతావనే నమ్మకం ఉందని అర్జున్ అంటాడు. ఆ నమ్మకం ఏదో నీ మీద నువ్వే పెట్టుకో అని సత్య కౌంటర్ వేస్తుంది. అలా చివరకు సత్య పట్టుదలగా ఉండటంతో.. అర్జున్ వదిలిపెట్టినట్టున్నాడు. దీంతో అర్జున్ నామినేషన్లోకి వచ్చాడు. అలా గీతూ వర్సెస్ చంటి.. ఇనయ వర్సెస్ శ్రీహాన్.. సూర్య వర్సెస్ ఫైమా.. రాజ్ వర్సెస్ బాలాదిత్య ఇలా జంటలుగా వచ్చాయి. చివరకు మెరినా, అర్జున్, చంటి, ఇనయ, ఫైమా, బాలాదిత్య ఇలా నామినేన్లోకి వచ్చారు. ఒక వేళ మెరినా ఎలిమినేట్ అయితే మాత్రం రోహిత్ ఒంటరి వాడు అయిపోతాడు.

Also Read :  Adipurush Teaser Records : అదరహో అనిపించే ఆదిపురుష్‌ టీజర్ రికార్డులు

Also Read : Sreemukhi Hot Pics : శ్రీముఖి తెలివే తెలివి.. అంతా కవర్ చేసి అది మాత్రం చూపించేసిందిగా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter Facebook

Read More