Home> వినోదం
Advertisement

Bigg Boss 5 Telugu: రసవత్తరంగా నామినేషన్స్ ప్రక్రియ.. డేంజర్‏ జోన్‏లో ఆ ముగ్గురు!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం ఎలిమినేషన్ కు సంబంధించిన జాబితా బయటకు వచ్చింది. మొత్తం 8 మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది. 

Bigg Boss 5 Telugu: రసవత్తరంగా నామినేషన్స్ ప్రక్రియ.. డేంజర్‏ జోన్‏లో ఆ ముగ్గురు!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రోజురోజూకు ఆసక్తిని పెంచుతోంది. షో మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.  ఇప్పటివరకు మూడు ఎలిమినేషన్స్(Elimination) జరిగాయి. అందులో మొదటి వారంలోనే సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత రెండో వారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడవ వారంలో లహరి(Lahari) హౌస్ నుంచి బయటకు వచ్చింది. నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ(Nomination process) తాజాగా జరిగింది.

నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ రచ్చ రచ్చ చేశారు. లోబో ప్రియ(Priya)పై రెచ్చిపోయాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ డైలాగ్ లు చెప్తూ తన విశ్వరూపం ప్రదర్శించాడు. యంకర్ రవి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. మొత్తానికి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్.. మొత్తం 8 మంది ఎలిమినేషన్‏కి నామినేట్ అయ్యారు.

Also Read: Bigg Boss 5 Telugu: లోబో, మాస్టర్‌ మీద కంటెస్టెంట్ల ఫైర్‌... ప్రోమో మామూలుగా లేదుగా!

ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై సోషల్ మీడియా(Social Media)లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఫ్యాన్ బేస్ ప్రకారం..సన్నీ, ప్రియ, యాంకర్ రవి, సిరిలకు ఎలాంటి ఢోకా లేదు. వీరు సేఫ్ జోన్‏లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా సభ్యులు.. లోబో.. నటరాజ్ మాస్టర్, కాజల్, యానీ మాస్టర్ డేంజర్ జోన్‏లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

అయితే ఇప్పటివరకు లోబో(Lobo) ఇంట్లో ఉండి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. నిజాంగా చెప్పాలంటే.. లోబో మినహా.. మిగతా ఇంటి సభ్యుల నుంచి ఎలాంటి ఆట తీరు.. స్టాటజీ కనిపించకపోగా.. షో చప్పగా సాగుతుందనేది ముందు నుంచి ఉన్న వాదన.. ఒకవేళ ఈసారి లోబో ఎలిమినేట్ అయితే.. కచ్చితంగా బిగ్ బాస్(Bigg Boss) షో బోరింగ్‏గా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా చూసుకుంటే లోబో కాస్త సేఫ్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలింది. యానీ మాస్టర్(Anee Master).. నటరాజ్ మాస్టర్, కాజల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More