Home> వినోదం
Advertisement

Bigg Boss 5 Telugu: లోబో, మాస్టర్‌ మీద కంటెస్టెంట్ల ఫైర్‌... ప్రోమో మామూలుగా లేదుగా!

Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ సీజన్ 5లో నామినేషన్ల రచ్చ మామూలుగా లేదు. తాజాగా విడుదలైన ప్రోమో రణరంగాన్ని తలపించింది. నటరాజ్ మాస్టర్, లోబోలతో కంటెస్టెంట్లకు చిన్నపాటి యుద్ధమే జరిగిందని తెలుస్తోంది.

Bigg Boss 5 Telugu: లోబో, మాస్టర్‌ మీద కంటెస్టెంట్ల ఫైర్‌... ప్రోమో మామూలుగా లేదుగా!

Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ సీజన్ 5(Bigg Boss 5 Telugu) రోజురోజూకీ ఆసక్తిని పెంచుతోంది. 18 మంది కంటెంస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ ఇప్పుడు 15 మందికి చేరింది.  తాజా విడుదలైన ప్రోమోలో నామినేషన్ల రచ్చ మామూలుగా లేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లో నటరాజ్‌ మాస్టర్‌(Nataraj Master) ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూనే కనిపిస్తాడు. వాళ్లు గేమ్‌ సరిగా ఆడట్లేదని, వీళ్లు హౌస్‌కు కరెక్ట్‌ కాదంటూ తెగ చిరాకు ప్రదర్శిస్తుంటాడు. హౌస్‌లో గుంటనక్క, ఊసరవెల్లి ఉన్నారంటాడు, కానీ వాళ్లెవరనేది బయటపెట్టడు. అయితే ఈ సారి నామినేషన్‌లో కంటెస్టెంట్స్ మాస్టర్‌ను గట్టిగానే వేసుకున్నట్లు కనిపిస్తోంది. 

డైలాగ్ తో రెచ్చిపోయిన మాస్టర్...చిర్రెత్తిపోయిన విశ్వ

నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారంటూ కాజల్‌(Kajal) నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. తనతో ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పమని అభ్యర్థించాడు మానస్‌(Manas). అటు హమీదా కూడా తన పనిని ఎవరైనా ఆపితే నచ్చదంటూ మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. విశ్వ, మాస్టర్‌కు మధ్య కూడా హీట్‌ డిస్కషన్‌ నడవగా 'సింహంతో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే' అని మాస్టర్‌ ఓ డైలాగ్‌ వదిలాడు. దీంతో మరింత చిర్రెత్తిపోయిన విశ్వ.. 'ఎహె, ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో' అని చిరాకు ప్రదర్శించాడు.

Also Read: Liger Movie Update: విజయ్ దేవరకొండ 'లైగర్’ సినిమాలో ఐరన్ మైక్ టైసన్

లోబోపై షణ్ముఖ్, సిరి ఫైర్
నామినేషన్స్‌లో లోబో మరోసారి తను కింది స్థాయి నుంచి వచ్చానంటూ చెప్పడం ఆరంభించగా షణ్ముఖ్‌(Shanmukh) మధ్యలోనే అడ్డుకున్నాడు. అందరం అక్కడి నుంచే వచ్చామని కౌంటరిచ్చాడు. ప్రతిసారి బస్తీ నుంచి, కింది స్థాయి నుంచి వచ్చానని చెప్పడం తప్పని దుమ్ము దులిపాడు. అటు సిరి కూడా నువ్వు సింపతీ కోసం ట్రై చేస్తున్నావనిపిస్తుందంటూ లోబో(Lobo)ను నామినేట్‌ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More