Bigg Boss Telugu Season 4 Voting Method | బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియ (Bigg Boss Voting) మొదలైంది. ఆదివారం (సెప్టెంబర్ 6న) ప్రారంభమైన షోలో రెండోరోజే ఓటింగ్ ఉంటుందని తెలిసిందే. దాంతోపాటు ఓటింగ్ అనగానే రచ్చ కూడా జరుగుతుంది. ఈ సీజన్లో కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాతలకు అసలు పొసగడం లేదు. రెండో రోజు గొడవపడ్డారు. అయితే తొలి వారం జంటగా వెళ్తే ఒక్కరిని నామినేట్ చేయడం వల్ల మొత్తం 7 మంది సభ్యులు నామినేషన్లో ఉన్నారు. Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్‌కి ఎట్లొచ్చింది ?
అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్ధక్, దివి, మెహబూబ్, సుజాత, గంగవ్వ తొలి వారం నామినేట్ అయ్యారు. సోమవారం రాత్రి నుంచే ఓటింగ్ ప్రక్రియ (Bigg Boss Telugu Voting) మొదలైంది. ఓటింగ్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి హాట్ స్టార్ ఓటింగ్. రెండో విధానం మొబైల్ నెంబర్ ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఫెవరెట్ కంటెస్టెంట్‌ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయవచ్చు. Bigg Boss 4: పాపం గంగవ్వ.. ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యింది వీరే...
హాట్ స్టార్‌లో ఆన్లైన్ ఓటింగ్..
స్టార్ మా అందిస్తున్న బిగ్ బాస్ 4 హాట్ స్టార్ యాప్‌లో చూడవచ్చు. అదే విధంగా హాట్ స్టార్ యాప్ వాడుతున్న వారు ప్రతిరోజూ ఎపిసోడ్ వీడియో మీద క్లిక్ చేయగానే ఓటింగ్ అని కనిపిస్తుంది. ఓటింగ్ మీద క్లిక్ చేయగానే నామినేషన్లో ఉన్న బిగ్ బాస్ హౌస్ సభ్యుల ఫొటోలు కనిపిస్తాయి. రోజుకు మొత్తం 10 ఓట్లు ఉంటాయి. వీటిని ఒకే వ్యక్తికి అయినా వేయవచ్చు. లేక ఒకరికి 5, మరొకరికి 3, మిగిలిన రెండు ఓట్లను ఇంకో సభ్యుడికి ఇలా ఏ విధంగానైనా సరే నామినేట్ అయిన వారికి ఓట్లు షేర్ చేయవచ్చు. ఒక్క క్లిక్ చేస్తే ఒక్క ఓటు పడుతుంది. యాప్ లేని వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి హాట్ స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్...
అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్ధక్, దివి, మెహబూబ్, సుజాత, గంగవ్వలకు ఒక్కో ఫోన్ నెంబర్ కేటాయించారు. ఆ నెంబర్‌కు మిస్ట్ కాల్ ఇస్తే ఒక్క ఓటు పడుతుంది. ఇలా ఒక్క ఫోన్ నెంబర్ నుంచి రోజు 10 ఓట్లు వరకు వేయవచ్చు. ఈ ఓట్లను ఒక్కరికే పదిసార్లు మిస్డ్ కాల్ ఇచ్చి 10 ఓట్లు వేసే వీలుంది. లేకపోతే ఒక్కో మిస్డ్ కాల్ చొప్పున ఈ ఓట్లను సర్దుబాటు చేస్తూ కూడా ఇతర కంటెస్టెంట్లకు వేయవచ్చు.
తొలి వారం నామినేట్ అయిన సభ్యుల ఓటింగ్ నెంబర్లు ఇవి.. ( Bigg Boss 4 Telugu missed call numbers to vote for Week 1 Elimination)
మీ ఫెవరెట్ కంటెస్టెంట్ గంగవ్వ అయితే 88866 58216కు మిస్డ్ కాల్ ఇస్తే ఒక ఓటు నమోదు అవుతుంది. ఇలా పది సార్లు మిస్డ్ కాల్ ఇస్తే ఆరోజు 10 ఓట్లు గంగవ్వకు పడతాయి.
Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు