Home> వినోదం
Advertisement

Big King Cobra Video: కింగ్‌ కోబ్రాకు చుక్కలు చూపించిన జీన్స్ ప్యాంట్ అమ్మాయి.. వీడియో చూస్తారా?


Big King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొండచిలువకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నటిజన్స్ దానిని పట్టుకోబోయిన యువతిని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Big King Cobra Video: కింగ్‌ కోబ్రాకు చుక్కలు చూపించిన జీన్స్ ప్యాంట్ అమ్మాయి.. వీడియో చూస్తారా?

Big King Cobra Video Watch Here: అనుకోకుండా పాములు కనిపిస్తే వాటిని చూసిన వెంటనే 20 అడుగుల దూరం పరిగెత్తే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది అయితే పామును చూసిన వెంటనే కేకలు వేసి భయభ్రాంతులకు గురై పరిగెత్తే వారిని చూసుంటాం కానీ ఇటీవలే ఓ యువతి భారీ కొండచిలువను చూడడమే కాదు.. ఏకంగా దానిని ఒంటి చేతితో పట్టేందుకు ప్రయత్నించింది. మామూలుగా కాదు.. కింద పడుతూ లేస్తూ ఒంటిచేత్తోనే పట్టుకోవాలని చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి చాలామంది స్నేక్ క్యాచర్స్ ఎలాంటి పాములనైనా పట్టుకోవడానికి కొన్ని పరికరాలను వినియోగిస్తూ ఉంటారు. కానీ ఈ యువతి మాత్రం కేవలం చేతులతో పట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో.. ఆ అమ్మాయి చివరికి పామును పట్టుకుందో లేదో ఇప్పుడు తెలుసుకోండి. 

వీడియో వివరాల్లోకి వెళితే.. భారీ కింగ్‌ కోబ్రా బురదలోని పొలాల్లో సంచారం చేస్తూ ఉంటుంది. అయితే దీనిని గమనించిన ఓ జీన్స్ ధరించిన యువతి ఆ పామును చేప అనుకొని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే పామని తెలుసుకొని ఆమె వంగి పాము తోకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ పాము మాత్రం బుసలు కొడుతూ పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఆ యువతి రెండుసార్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ఆ పాము చిక్కకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి మరోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ సమయంలో ఆ పాము ఆమె వైపుకు తిరిగి కాటేసే ప్రయత్నం చేస్తుంది. దీనిని ముందే గమనించిన ఆ యువతి పాము చేతుల నుంచి తప్పించుకుంటుంది. అయినప్పటికీ ఆ యువతి వదలకుండా మరోసారి ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆ పాము భయాందోళనకు గురై జరజర పాకుతూ పారిపోవడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు.

ఆ యువతి ఎన్నిసార్లు పామును పట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం ఆ కింగ్‌ కోబ్రా దొరకకుండా వెళ్ళిపోయింది. అయితే పొలంలో ఎక్కువగా మట్టి ఉండడం కారణంగానే పట్టుకున్న ప్రతిసారి పాము చేతుల నుంచి జారిపోయింది. అంతేకాకుండా ఆమె ఆ కొండచిలువను పట్టుకోవడానికి చూస్తే కేవలం వీడియో కోసమే ఇలా పట్టుకునేందుకు ప్రయత్నించిందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే పామును పట్టుకునేందుకు వణుకుతారు.. అయితే ఈమె ఏమాత్రం అనుభవం లేకున్నా పట్టుకోవడానికి ప్రయత్నించడాన్ని అందరూ శభాష్ అంటున్నారు. 

ఈ వీడియోను GURUKUL EduTech అనే ఓ య్యూటుబ్ చానెల్‌ నుంచి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది య్యూటుబ్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో షేర్ చేసి చాలా రోజులైనప్పటికీ ఇప్పుడు వైరల్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని లక్షల మందికిపైగా వీక్షించారు. అలాగే నెటిజన్స్ వారి అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తమ లైఫ్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలని ధైర్యంతో ముందుకెళితే ఎలాంటి పనులైనా చేయవచ్చని అంటున్నారు. మరి కొంతమంది నెటిజన్స్ ఆమె ధైర్య సాహసాలకు నమస్కారమని ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More