Home> వినోదం
Advertisement

Bheemla Nayak Updates: భీమ్లా నాయక్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న డైరెక్టర్

Bheemla Nayak Updates: పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భీమ్లానాయక్ విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాలున్న ఈ సినిమాకు దర్శకుడయ్యే అదృష్టాన్ని అతడు వదులుకున్నాడట. ఎవరా దర్శకుడు..ఆ వివరాలేంటి

Bheemla Nayak Updates: భీమ్లా నాయక్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న డైరెక్టర్

Bheemla Nayak Updates: పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భీమ్లానాయక్ విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాలున్న ఈ సినిమాకు దర్శకుడయ్యే అదృష్టాన్ని అతడు వదులుకున్నాడట. ఎవరా దర్శకుడు..ఆ వివరాలేంటి

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక వరుస సినిమాల సందడి ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమా మరో ఐదు రోజుల్లో అంటే ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 21  తేదీన అంటే రేపు భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. విశేషమేమంటే ఈ సినిమా ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు. అదే రోజు అంటే ఫిబ్రవరి 21వ తేదీన ట్రైలర్ విడుదల కావచ్చని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి భీమ్లానాయక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సాగర్ కే చంద్ర తొలి ఛాయిస్ కాదంట. మళయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను రీమేక్ చేయాలని పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ నిర్ణయించుకున్నప్పుడు..బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయతో తీయాలనుకున్నారు. అయితే ఆ సమయంలో వివేక్ ఆత్రేయ..నాని సినిమాతో బిజిగా ఉండటంతో..గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఆ తరువాత సాగర్ కే చంద్ర తలుపు తట్టింది. పోలీస్ అధికారిగా పవన్ నటిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ సమకూర్చగా, తమన్ సంగీతం అందించాడు. నిత్యామీనన్, సంయుక్తా మీనన్‌లు పవన్ సరసన నటించారు. 

Also read: Ester Comments On Tollywood: అందుకు నో చెప్పానని ఛాన్సులు ఇవ్వలేదు.. టాలీవుడ్ హీరోలపై ఏస్తర్ సంచలన వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More