Home> వినోదం
Advertisement

Bheemla Nayak New Update: ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ బిజినెస్ షురూ.. రికార్డు ధరకు నైజాం రైట్స్?

Bheemla Nayak New Update: పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' (bheemla nayak release date) సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు ఇటీవలే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే సినిమాను అనుకున్న సమయానికే రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కు రికార్డు ధర లభిస్తోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Bheemla Nayak New Update: ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ బిజినెస్ షురూ.. రికార్డు ధరకు నైజాం రైట్స్?

Bheemla Nayak New Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' (bheemla nayak release date) చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజైన ‘లాలా భీమ్లా’ పాట యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. అయితే.. ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. కానీ, సినిమాను సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. అనుకున్న సమయానికే.. అంటే జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కు రికార్డు ధర లభిస్తోందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. నైజాం రైట్స్ కోసం నిర్మాత దిల్ రాజు రూ.40 కోట్లు వెచ్చించినట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సిఉంది.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం సంక్రాంతి రేసులో 'ఆర్ఆర్ఆర్'(జనవరి 7), 'రాధేశ్యామ్'( జనవరి 14) ఉన్నాయి. 'బంగార్రాజు' (జనవరి 15-ఖరారు కాలేదు) ఉన్నాయి. మహేశ్ 'సర్కారు వారిపాట' చిత్రాన్ని కూడా మొదట జనవరి 13న విడుదల చేయాలని భావించింది చిత్రబృందం. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్1న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది.

Also Read: Shilpa Shetty-Raj Kundra: శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంపతులపై చీటింగ్‌ కేసు నమోదు

Also Read: Rajkummar Rao Engagement: నటి పత్రలేఖతో హీరో రాజ్ కుమార్ రావ్ ఎంగేజ్మెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More