Home> వినోదం
Advertisement

Bheemla Nayak Release: సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్?.. ట్విట్టర్ లో ట్రెండింగ్

Bheemla Nayak Release: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్' (Bheemla Nayak Movie). సంక్రాంతికి రిలీజ్ (Sankranti 2022 Movies) కావాల్సిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాల కోసం ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. కానీ, ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజ్ వాయిదా (RRR Movie Postponed) పడడం వల్ల సంక్రాంతి రేసులో నిలవాలని ఆ చిత్ర నిర్మాతలు యోచిస్తున్నట్లు ట్విట్టర్ లో ట్రెండ్ నడుస్తోంది. 
 

Bheemla Nayak Release: సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్?.. ట్విట్టర్ లో ట్రెండింగ్

Bheemla Nayak Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' (Bheemla Nayak Movie) చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజైన టైటిల్ సాంగ్ రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. అయితే.. ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు ఇటీవలే ఆ మూవీ మేకర్స్ ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి పాన్ ఇండియా చిత్రాల (Sankranti 2022 Movies) కోసం 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ ను ఫిబ్రవరికి వాయిదా వేశారు. 

అయితే శనివారం (జనవరి 1) 'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజ్ ను వాయిదా (RRR Movie Postponed) వేస్తున్నట్లు ఆ చిత్రబృందం ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తి, కొన్ని రాష్ట్రాలు సహా అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని థియేటర్ల మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో వేరే గత్యంతరం లేక సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 

ఈ క్రమంలో 'భీమ్లా నాయక్' మళ్లీ సంక్రాంతి రేసులో నిలిచే అవకాశం ఉందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీ అనుకున్న సమయానికే విడుదల (Radhe Shyam Release Date) అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. ఒకవేళ 'రాధేశ్యామ్' విడుదల పోస్ట్ పోన్ అయితే మాత్రం భీమ్లా నాయక్ బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ట్విట్టర్ లో ఎప్పడూ లేనంత ట్రెండ్ నడుస్తోంది. అయితే చివరికి నిర్మాతలు ఏం డిసైడ్ చేస్తారనే విషయం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్ గా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' (Bheemla Nayak Release Date) సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా పనిచేస్తున్నారు.  

Also Read: Varshini Latest Photos: న్యూఇయర్ లో డోస్ పెంచేసిన యాంకర్ వర్షిణి.. హాట్ పిక్స్ మామూలుగా లేవుగా!

Also Read: RRR Postponed: ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఒమిక్రాన్ ధాటికి రిలీజ్ వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More