Home> వినోదం
Advertisement

Chatrapathi Remake : బెల్లంకొండ పరిస్థితి ఇలా మారిందేంటి?.. అన్న కంటే తమ్ముడే బెటరా!

Chatrapathi Remake Issue ఛత్రపతి రీమేక్ అనే చెత్త ఐడియాను ఎవరు ఎలా తెర మీదకు తీసుకొచ్చారో గానీ.. మొత్తానికి ఆ ఆలోచన పరమ వేస్ట్‌ది అని ఇప్పుడు తెలుసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఛత్రపతి రీమేక్‌కు బ్రేకులు పడ్డట్టు కనిపిస్తోంది.

Chatrapathi Remake : బెల్లంకొండ పరిస్థితి ఇలా మారిందేంటి?.. అన్న కంటే తమ్ముడే బెటరా!

Bellamkonda Srinivas Chatrapathi Remake బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌కు చిక్కులు వచ్చినట్టు కనిపిస్తోంది. అసలు ఛత్రపతి రీమేక్ అనేదే ఓ విచిత్రమైన ఆలోచన. అది ఎప్పుడో వచ్చింది. ఆ సినిమాను నార్త్ జనాలు కూడా చూశారు. అలాంటి సినిమాను మళ్లీ ఇప్పుడు రీమేక్ చేసి హిందీలో రిలీజ్ చేస్తామని అనేడమే వింతగా కనిపిస్తుంది. ఇక ఆ సినిమాను మళ్లీ తెలుగులోనూ రిలీజ్ చేస్తారేమో. అయితే ఇప్పుడు తాజాగా ఛత్రపతి రీమేక్ మీద ఓ వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. అయితే సినిమాను బయటకు వదలాలా? వద్దా? అనే ఆలోచనలో నిర్మాణ సంస్థ పడిందట. అసలు థియేటర్లో ఈ సినిమా ఇప్పుడు చూస్తారా? అనే అనుమానం వచ్చిందట. నేరుగా ఓటీటీలోకి వదిలేద్దామా? అనే ఆలోచనలు కూడా వచ్చాయట. నాన్ థియేట్రికల్ రైట్స్ సైతం అంతగా ఇంపాక్ట్ ఇవ్వడం లేదట. బజ్ లేకపోవడంతో బిజినెస్ కూడా జరగడం లేదట.

అలా ఈ సినిమాను ఏం చేయాలో తెలీక మేకర్లు తల పట్టుకుంటున్నారట. అనవసరపు మాస్ ఇమేజ్ అంటూ ఇలాంటి పిచ్చి ఆలోచనలతో కెరీర్‌ను చిక్కుల్లో పడేసుకుంటున్నాడు బెల్లకొండ శ్రీనివాస్. అదే బెల్లంకొండ గణేష్ అయితే మాస్ ఇమేజ్‌కు దూరంగా.. సెన్సిబుల్ కథతో వచ్చి.. మొదటి సినిమా స్వాతిముత్యంతోనే హిట్ కొట్టేశాడు. ఇక రెండో సినిమా కూడా లైన్‌లో పెట్టాడు. ఫ్యామిలీ కథలు, లవ్ స్టోరీలు ఎంచుకుంటూ అన్న కంటే ఫాస్ట్‌గా ఓ స్టార్ ఇమేజ్‌ను దక్కించుకునేలా ఉన్నాడు.

ఇప్పుడు బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే బెల్లకొండ శ్రీనివాస్ తదుపరి సినిమాలపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More