Home> వినోదం
Advertisement

KGF Dialogue Wedding Card: కేజీఎఫ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే... ఏకంగా వెడ్డింగ్ కార్డుపై యశ్ డైలాగ్...

KGF Dialogue on Wedding Card: కేజీఎఫ్ ఫీవర్‌తో సినీ ప్రేక్షకులు ఊగిపోతున్నారు. సినిమా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే... ఏకంగా ఓ జంట తమ వెడ్డింగ్ కార్డుపై కేజీఎఫ్ డైలాగ్‌నే ప్రింట్ చేశారు.

KGF Dialogue Wedding Card: కేజీఎఫ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే... ఏకంగా వెడ్డింగ్ కార్డుపై యశ్ డైలాగ్...

KGF Dialogue on Wedding Card: కేజీఎఫ్... కేజీఎఫ్... ప్రస్తుతం ఎక్కడ చూసినా కేజీఎఫ్ 2 మేనియానే కనిపిస్తోంది. సినీ ప్రేక్షకులు కేజీఎఫ్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. సినిమాలో యశ్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో యశ్ పలికిన ఓ డైలాగ్ ఏకంగా ఓ జంట వెడ్డింగ్ కార్డుపై ముద్రించారంటే మూవీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటకలోని బెల్గావికి చెందిన చంద్రశేఖర్-శ్వేత వివాహం మే 13న జరగనుంది. వరుడు చంద్రశేఖర్ తమ వెడ్డింగ్ కార్డును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వెడ్డింగ్ కార్డుపై కేజీఎఫ్ 2 సినిమా డైలాగ్ ఉండటంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మ్యారేజ్, మ్యారేజ్, మ్యారేజ్.. ఐ డోంట్ లైకిట్.. ఐ అవాయిడ్, బట్ మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్.. ఐ కాంట్ అవాయిడ్..' అనే డైలాగ్‌ను పెళ్లి కార్డుపై ముద్రించారు. 

కేజీఎఫ్ 2 సినిమాలోని 'వయలెన్స్, వయలెన్స్, వయలెన్స్.. ఐ డోంట్ లైకిట్. ఐ అవాయిడ్. బట్ వయలెన్స్ లైక్ మి. ఐ కాంట్ అవాయిడ్.' అంటూ యశ్ పలికిన డైలాగ్‌లో వయలెన్స్‌కు బదులు మ్యారేజ్‌ని చేర్చి పెళ్లి కార్డుపై ముద్రించారు. ఈ వెడ్డింగ్ కార్డుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వరుడిని కేజీఎఫ్ 3 సినిమాలో తీసుకోవాలంటూ ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇండియాలో ఏదైనా సాధ్యమే అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. బహుశా ఆ వరుడు రాకీ భాయ్ ఫ్యాన్ అయి ఉంటాడని... అందుకే వెడ్డింగ్ కార్డుపై కేజీఎఫ్ డైలాగ్ ప్రింట్ చేశాడని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. 'నాటీ వరల్డ్' అనే ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వెడ్డింగ్ కార్డుకు ఇప్పటివరకూ 1 లక్ష పైచిలుకు వ్యూస్ వచ్చాయి. 

Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-సమంత జంటగా కొత్త సినిమా లాంచ్... విజయ్ లుక్ మారిందిగా..!  

Also Read: KGF 2 Collection: రాజమౌళిని వెనక్కినెట్టిన ప్రశాంత్ నీల్? ఆర్ఆర్ఆర్ రికార్డును కొల్లగొట్టిన KGF 2! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More