Home> వినోదం
Advertisement

Bigg Boss 7 Telugu Voting: ఓటింగ్ లో దూసుకుపోతున్న శివాజీ... అట్టడుగున సీరియల్ బ్యాచ్..

BB7 Updates: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఆసక్తిరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో తక్కువ ఓటింగ్ సీరియల్ బ్యాచ్ కే వచ్చింది. 
 

Bigg Boss 7 Telugu Voting: ఓటింగ్ లో దూసుకుపోతున్న శివాజీ... అట్టడుగున సీరియల్ బ్యాచ్..

Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ సీజన్ 07 తెలుగు నాగార్జున ముందుగానే చెప్పినట్లు ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ నుంచి 04 ఎలిమినేట్ అవ్వడంతో.. పది మంది మాత్రమే మిగిలారు. అయితే ఐదో వారం నామినేషన్స్ లో శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ, ప్రియాంక జైన్ ఉన్నారు. ప్రశాంత్, సందీప్ మరియు శోభా సేప్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ పోల్ వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. దాని ప్రకారం, హీరో శివాజీ  38.73 శాతం ఓట్లతో మెుదటి స్థానంలో ఉన్నాడు. మెున్నటి వరకు రెండో స్థానంలో ఉన్న యావర్ మూడో స్థానానికి పడిపోగా.. గౌతమ్ కృష్ణ రెండు ప్లేస్ కు దూసుకొచ్చాడు. 26.22 శాతం ఓట్లతో గౌతమ్ రెండో స్థానంలో, 8.83 శాతం ఓట్లతో యావర్ మూడో స్థానంలోనూ నిలిచారు. 7.37 శాతం ఓట్లతో శుభ శ్రీ నాలుగో స్థానంలోనూ, 7.08 శాతం ఓట్లతో టేస్టీ తేజ ఐదో స్థానంలోనూ నిలిచారు. ఆట సరిగా ఆడకుండా కబుర్లుతోనే సరిపెడుతున్న అమర్ దీప్ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీరియల్ హీరోకు 6.38 శాతం ఓట్ల మాత్రమే వచ్చాయి. ఇక ఏడో స్థానంలో హీరోయిన్ ప్రియంక 5.39 శాతం ఓట్లతో కొనసాగుతోంది. అంటే ఈ వారం డేంజర్ జోన్ లో ప్రియాంక, అమర్ దీప్ ఉన్నారన్న మాట. 

అయితే ఈ సారి బిగ్ బాస్ లో భారీగా వైల్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయట. ఈ సారి ఒకేసారి ఐదుగురు హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఆదివారం జరగనుంది. ఈ సారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అర్జున్ అంబటి, పూజా మూర్తి, కెవ్వు కార్తీక్, నయని పావని, భోలే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఆదివారం గ్రాండ్ లాంఛ్ ఉంది కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 

Also read: Saindhav Release date: సంక్రాంతి బరిలో వెంకటేష్ 'సైంధవ్'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More