Home> వినోదం
Advertisement

Bhagavanth Kesari : హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలకృష్ణ.. దసరా విన్నర్ షురు..

Bhagavanth Kesari box-office collections: ఈ దసరాకి మూడు సినిమాలు విడుదల కాగా అందులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు మాత్రమే పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎమోషన్స్ అలానే యాక్షన్ సమపాలలో ఉన్నాయి అని, ముఖ్యంగా బాలకృష్ణ తన మాస్ ఇమేజ్ దాటి కొత్తగా ట్రై చేసి సూపర్ హిట్ అందుకున్నారు అని నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ప్రశంసిస్తున్నారు. మరి ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్షన్ సాధించిందో ఒకసారి చూద్దాం..
 

Bhagavanth Kesari : హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలకృష్ణ.. దసరా విన్నర్ షురు..

Bhagavanth Kesari collections: ఈ దసరాకి ఏకంగా మూడు భారీ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో రెండు మన తెలుగు సినిమాలే కాగా ఒకటి మాత్రం తమిళ డబ్బింగ్ సినిమా వీడియో. జియో సినిమా లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో బాదం కావడంతో మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కూడా సొంత సినిమా లాగా చూసుకున్నారు.. అయితే మీ చిత్రం కి మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోతోంది లియో. ఇక ఈ తమిళ్ డబ్బింగ్ సినిమాని పక్కన పెడితే మన తెలుగులో రిలీజ్ అయిన ఇంకో రెండు సినిమాలు బాలకృష్ణ భగవంత్ కేసరి అలానే రవితేజ టైగర్ నాగేశ్వరరావు. ఇందులో బాలకృష్ణ సినిమా అక్టోబర్ 19న విడుదల కాగా రవితేజ సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదలైంది. అయితే బాలకృష్ణ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా రవితేజ సినిమా మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకునింది. ఇక రెస్పాన్స్ పరంగానే కాదు కలెక్షన్స్ పరంగా కూడా బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపించారు. తొలిరోజే 32 కోట్ల గ్రాస్ వసూలు చేసిన బాలకృష్ణ సినిమా రెండు రోజులకు గాని హాఫ్ సెంచరీ అందుకుంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.51.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇదే విషయాన్ని ఈరోజు ఈ సినిమా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా ప్రకటించింది. ఇక బాలకృష్ణ హాఫ్ సెంచరీ కొట్టిన విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌పై రెండు రోజుల బాక్సాఫీసు కలెక్షన్‌ను పేర్కొంది. అంతేకాదు, ‘దసరా విన్నర్’ అని కూడా పోస్టర్ మీద వేసేసారు సినిమా మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో థియేటర్స్లోకి దిగిన బాలయ్య సినిమా తొలిరోజు ఈ ప్రపంచ వ్యాప్తంగా రూ.32.33 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు రెండు రోజుల్లో ఈ సినిమా సాధించిన లెక్క కానీ చూస్తే, తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీసు వసూళ్లు కాస్త తగ్గాయి. కాగా నిన్న శుక్రవారం కావడంతో మళ్లీ ఈ శని, ఆదివారం బుకింగ్స్ పెరిగి కలెక్షన్లు రావచ్చు అని సినీ వర్గాల అంచనా.

 

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ‘భగవంత్ కేసరి’ తొలిరోజు రూ.17.8 కోట్ల, రెండో రోజు మాత్రం రూ.13 కోట్ల మేర గ్రాస్ వసూలైందని అంటున్నారు. మొత్తానికి రెండు రోజులతో కలిపి తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఈ సినిమా రూ. 16 కోట్ల మేర కలెక్షన్ సాధించింది తెలుస్తోంది. మరోవైపు, ఓవర్సీస్‌లోనూ ‘భగవంత్ కేసరి’ మంచి వసూళ్లు రాబడుతోంది. యూఎస్‌ఏలో ఇప్పటికే 8 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. ప్రస్తుతం 1 మిలియన్ డాలర్ మార్కు వైపు పరుగులు తీస్తోంది. ఇక ఇదే కంటిన్యూ అయ్యి శని ఆదివారం మరింత కలెక్షన్స్ పెరిగి దూసుకుపోతే బాలయ్య సినిమా ఓవరాల్ 80 కోట్ల వరకు సాధించవచ్చు అని అంచనా వేస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు

ఇది కూడా చదవండి: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Read More