Home> వినోదం
Advertisement

Balagam Narsingam: టాలీవుడ్‌లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత..

Balagam Actor death: చిన్న సినిమాగా వచ్చిన బలగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేసిన నర్సింగం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశాడు దర్శకుడు వేణు.
 

Balagam Narsingam: టాలీవుడ్‌లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత..

Balagam Narsingam Passes away: జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'బలగం'(Balagam movie). చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా సాలిడ్ హిట్ కొట్టింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మార్చి 31న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాకుండా వందకుపైగా అంతర్జాతీయ పురస్కారాలను సాధించింది. కొద్ది రోజుల కిందటే బలగం సినిమా గురించి మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. 

ఇదే సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన నర్సింగం(Narsingam) తాజాగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని  బలగం దర్శకుడు వేణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ''బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను. నాకోసం  ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు'' అని వేణు పేర్కొన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నర్సింగంతో కలిసున్న ఫొటోలను తాజాగా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు వేణు. నర్సింగం మరణవార్తను విన్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. 

Also Read: Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో రెమ్యూనరేషన్ ఎవరికి ఎక్కువంటే?

Also Read: Tovino Thomas injured: షూటింగ్‌లో గాయపడ్డ మలయాళ స్టార్‌ హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More