Home> వినోదం
Advertisement

Ram Charan @ Rc 15 Set: గొప్ప పెంపకం.. ఆయన ముందు చేతులు కట్టుకునే ఉంటాడు.. రామ్ చరణ్‌పై ప్రియదర్శి కామెంట్స్

Priyadarshi on Ram Charan @ Rc 15 Set: ప్రియదర్శి తాజాగా రామ్ చరణ్‌ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శంకర్ రామ్ చరణ్‌ కలిసి చేస్తోన్న సినిమాలో ప్రియదర్శి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సెట్‌లో ప్రియదర్శి చూసిన విషయాన్ని చెప్పాడు.

Ram Charan @ Rc 15 Set: గొప్ప పెంపకం.. ఆయన ముందు చేతులు కట్టుకునే ఉంటాడు.. రామ్ చరణ్‌పై ప్రియదర్శి కామెంట్స్

Priyadarshi Comments on Ram Charan @ Shankar's RC 15 Set: ప్రియదర్శి ప్రస్తుతం బలగం సినిమాతో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. మల్లేశం సినిమా తరువాత మళ్లీ ఈ రేంజ్‌లో ప్రియదర్శి హాట్ టాపిక్ అయ్యాడు. ప్రియదర్శి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చల్లోకి వస్తున్నాడు. అలాంటి ప్రియదర్శి తాజాగా రామ్ చరణ్‌ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్‌ శంకర్ సినిమాలో ప్రియదర్శి ఓ కీ రోల్ పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రామ్ చరణ్‌తో కలిసి పని చేసిన అనుభవాన్ని పంచుకున్నాడు ప్రియదర్శి. ఆయన చాలా హంబుల్‌గా ఉంటారని, శంకర్ సర్ వస్తే.. చేతులు కట్టుకునే ఉంటాడని, ఏం చెప్పినా సరే చేసేద్దాం సర్ అని అంటాడు.. షాట్‌ అంటే షాట్‌కు రెడీ అవుతాడంటూ, అద్భుతంగా చేసేస్తాడంటూ ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించిన ఈ మనిషేనా? ఇక్కడ ఇలా నటిస్తున్నాడ అని ఆశ్చర్యపోయేవాడట. రాజమౌళి ఏం చెబితే అది చేసేశాను అని సింపుల్‌గా చెప్పేస్తాడట రామ్ చరణ్. కలిసి భోజనం చేస్తామని, తినడానికి రమ్మని పిలుస్తాడంటూ చిరంజీవి గారి పెంపకం చాలా గొప్పదని, రామ్ చరణ్‌ అన్నని చూస్తే చిరంజీవిని చూసినట్టే ఉంటుందని ప్రియదర్శి అన్నాడు.

రామ్ చరణ్ శంకర్ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీఈవో అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్‌ బర్త్ డే స్పెషల్‌గా మార్చి 27న ఈ మూవీ నుంచి టైటిల్‌ పోస్టర్లు, గ్లింప్స్ వస్తాయని సమాచారం. ఇప్పటికే శంకర్ తన స్టైల్లో పోస్టర్లను డిజైన్ చేయించినట్టుగా సమాచారం అందుతోంది.

Also Read:  Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్

Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More