Home> వినోదం
Advertisement

Bade Miyan Chote Miyan: బడే మియా చోటే మియా బిగ్ అప్డేట్.. ఈ సినిమాకి షారుక్ ఖాన్ కి సంబంధం ఏమిటంటే!

Akshay Kumar: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలగా రాబోతున్న బడే మియా చోటే మియా చిత్రంపై బాలీవుడ్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటుంది..

Bade Miyan Chote Miyan:  బడే మియా చోటే మియా బిగ్ అప్డేట్.. ఈ సినిమాకి షారుక్ ఖాన్ కి సంబంధం ఏమిటంటే!

Bade Miyan Chote Miyan Action Sequences
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలగా రాబోతున్న 'బడే మియా చోటే మియా సినిమాపై ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రానికి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫీర్ క్రైజి మక్రయ్ అందించడం విశేషం. గతంలో  క్రైజి మక్రయ్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా చేసిన పఠాన్, జవాన్ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు బడే మియా చోటే మియాన్ చిత్రానికి అదే రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ను కంపోజ్ చేశారు. కాగా ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఫైట్స్ చూస్తే క్రైజి మక్రయ్ వర్క్ మనకు కనిపించడం ఖాయం.

అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ యాక్షన్ సీన్స్ హైలెట్గా నిలవనున్నాయి అని వినికిడి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మధ్య విడుదలైన ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్టన్ అవతారంలో హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాళ్ళ కనిపించి మెప్పించారు.ఈ సినిమాని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

 భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, సూపర్ యాక్షన్స్ సన్నివేశాలతో అందరిని అల్లరించబోతోందని చిత్ర యూనిట్ ఈ మధ్యనే  తెలియజేశారు. ఈమధ్య హిందీ సినిమాలు అన్ని భాషలలో విడుదలై సూపర్ హిట్ లు అందుకుంటున్న క్రమంలో ఈ చిత్రం కూడా ఆ జాబితాలోకి చేరనుంది అని నమ్మకం వ్యక్తం చేశారు చిత్ర యూనిట్.

వశు భగ్నానీ, పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థ అసోసియేషన్ లో ఈ సినిమాని ప్రెసెంట్ చేయగా ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ రచన,‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్, ఆలయ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More