Home> వినోదం
Advertisement

Rakul Preet Singh: అప్పుడు భర్త.. ఇప్పుడు తమ్ముడు.. రకుల్ కి షాక్ మీద షాక్!

Rakul Preet Brother: కొన్నేళ్ల క్రితం హాట్ హీరోయిన్‌గా.. ఉండే రకుల్ ప్రీత్ కెరియర్ వరుస ఫ్లాప్స్ తో పడిపోయింది. పోనీ పెళ్లయ్యాక అయినా ఆమె జీవితం బాగుందా అంటే, భర్త జాకీ భగ్నాని దివాలా.. తీసిన సంగతి తెలిసిందే. మరోవైపు రకుల్ సోదరుడు.. అమన్ ప్రీత్ సింగ్..ఇప్పుడు డ్రగ్ కేసులో అరెస్టు అయ్యి రకుల్ కి మరొక షాక్ ఇచ్చాడు. 

Rakul Preet Singh: అప్పుడు భర్త.. ఇప్పుడు తమ్ముడు.. రకుల్ కి షాక్ మీద షాక్!

Rakul Preet Brother Drug Racket: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ పేరు ముందే ఉండేది. దాదాపు స్టార్ హీరోలు.m అందరితోనూ సినిమాలు చేసిన రకుల్ ప్రీత్.. మహేష్ బాబు సరసన నటించిన స్పైడర్ సినిమా తర్వాత.. ఇండస్ట్రీలో కనిపించడమే మానేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకి ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. 

దీంతో మళ్లీ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని వెతుక్కుంది. అక్కడే పలు సినిమాల్లో నటించిన రకుల్ బాలీవుడ్ నటుడు జాకీ భాగ్నాని ప్రేమించి.. పెళ్లి చేసుకుంది. ఒకవైపు సినిమాల పరంగా చూస్తే ఈమెకి.. ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. మరోవైపు వ్యక్తిగత జీవితం కూడా బోలెడు ఇబ్బందులతో నిండిపోయింది. 

పెళ్లయిన కొద్ది వారాలకి తన భర్త జాకీ భగ్నాని సొంత ప్రొడక్షన్ బ్యానర్ పూజా ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో దివాలా తీసింది. భగ్నాని కుటుంబం.. అప్పుల్లో మునిగిపోయింది. ఇక మళ్లీ సినిమాల్లోకి భారతీయుడు 2 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది రకుల్. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

వీటన్నిటి నుంచి ఇంకా బయట పడక ముందే ఇప్పుడు రకుల్ కి మరొక దెబ్బ తగిలింది. రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఎప్పటి నుంచో నడుస్తున్న కొకైన్ కేసులో.. తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు.. రెండు 2.6 కేజీల కొకైన్ ను సీజ్ చేశారు. దాని విలువ రెండు కోట్లు అని తెలుస్తోంది. 

అమన్ ప్రీత్ సింగ్ తో పాటు మరొక ఐదుగురు కూడా ఈ కేసులో పట్టుపడ్డారు. ఇందులో అమన్ ప్రీత్ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వీరికి టెస్ట్ చేయగా అమన్ ప్రీత్ కొకైన్ తీసుకున్నట్టు.. పాజిటివ్ వచ్చింది అని తెలుస్తుంది. ఎన్ డి పి ఎస్ యాక్ట్.. 27 ప్రకారం.. అమన్ పేరుని ఏ 6 గా మార్చారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత.. పోలీసులు వారిని.. కోర్టులో హాజరుపరచరన్నారు.

Also read: TG DSC and Groups issue: సచివాలయం దగ్గర హైటెన్షన్... నిరసనకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు.. వీడియో ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More