Home> వినోదం
Advertisement

Avram Manchu: మంచు ఫ్యామిలీ నుంచి మరో నటుడు.. కన్నప్ప మూవీతో అవ్రామ్ మంచు ఎంట్రీ

Manchu Vishnu Kannappa Movie: మంచు ఫ్యామిలీ నుంచి మరో నటుడు వెండితెరకు పరిచయం కానున్నాడు. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ మంచు కన్నప్ప మూవీ ద్వారా వెండితెరకు పరిచయం కానున్నాడు. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

Avram Manchu: మంచు ఫ్యామిలీ నుంచి మరో నటుడు.. కన్నప్ప మూవీతో అవ్రామ్ మంచు ఎంట్రీ

Manchu Vishnu Kannappa Movie: డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘కన్నప్ప’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. న్యూజిలాండ్‌లో లాంగ్‌ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా.. ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చింది కన్నప్ప మూవీ టీమ్. తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ద్వారా మంచు వారి మూడో తరం నటుడు తెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మోహన్ బాబు వారసుడిగా విష్ణు మంచు రాగా.. విష్ణు మంచు వారుసుడిగా అవ్రామ్ మంచు కన్నప్ప సినిమాతో వెండితెరకు బాలనటుడిగా పరిచయం కానున్నాడు. భారీ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీతో అవ్రామ్ సినిమా రంగ ప్రస్థానం మొదలు పెట్టనున్నాడు. మోహన్ బాబు నుంచి మొదలుకొని ఈ మూవీలో మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తున్నట్లైంది. ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

90 రోజులపాటు న్యూజిలాండ్‌లో అద్బుతమైన లోకేషన్స్‌లో ప్రకృతి దృశ్యాల మధ్య కన్నప్ప మూవీ షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో అవ్రామ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లు తెలిసింది. తన కొడుకు సినిమాలో నటిస్తుండడంపై విష్ణు మంచు ట్విట్టర్‌లో స్పందించారు. ఒక కొత్త శకం ఆరంభం అవుతున్నప్పుడు థ్రిల్‌కు మించి ఉంటుంది. అవ్రామ్ మంచు 'కన్నప్ప'తో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. నా కొడుకు కీలక పాత్రలో నటించడం గర్వకారణం. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మా కుటుంబం మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన మూవీ.." అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

 

కన్నప్ప మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే.. విష్ణు మంచు తనకు సహకరించిన చిత్ర బృందానికి థ్యాంక్స్ చెప్పారు. అవ్రామ్‌తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని తెలిపారు. సినీ ప్రేమికులందరి ఆశీర్వాదం కోరుకుంటున్నానని అన్నారు. 'కన్నప్ప' మూవీ ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు.  

Also Read: Telangana MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసీ బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే షాక్  

Also Read: Guntur Kaaram Update: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌ద్దు.. కారణం ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Read More