Home> వినోదం
Advertisement

Avika Gor Pop Corn : ‘పాప్ కార్న్’ సెన్సార్ టాక్.. సినిమా ఎలా ఉండబోతోందంటే?

Pop Corn Censor Review అవికా గోర్ హీరోయిన్‌గానే కాకుండా నిర్మాణంలో భాగస్వామిగా చేరిపోయింది. ఆమె తాజాగా చిత్రం పాప్ కార్న్. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి ప్రశంసించారు.

Avika Gor Pop Corn : ‘పాప్ కార్న్’ సెన్సార్ టాక్.. సినిమా ఎలా ఉండబోతోందంటే?

Avika Gor Pop Corn Censor చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్ సినిమా నిర్మాణంలోకి కూడా వచ్చింది. హీరోయిన్‌గా నటించడమే కాకుండా సినిమాలో పెట్టుబడి కూడా పెట్టినట్టు తెలుస్తోంది. స‌హ నిర్మాత‌గా మారి పాప్ కార్న్ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో సాయి రోనక్‌తో అవికా గోర్ రొమాన్స్ చేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల అవుతోంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారి చేశారు.

పాప్ కార్న్ సినిమాను ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీని భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఫిబ్రవరి 10న సినిమా రిలీజ్ అవుతుండటంతో నేడు సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేశారు.

ఈ సినిమాను వీక్షించిన అనంతరం సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారట. సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని పొగిడేశారట. ఈ మేరకు చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు మాట్లాడుతూ.. పాప్ కార్న్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, సెన్సార్ సభ్యులకు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని అని అన్నాడు.

కో ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించిన అవికా గోర్ మాట్లాడుతూ .. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని చెప్పుకొచ్చింది. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ.. చివ‌రి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఉందని సెన్సార్ సభ్యులు పొగిడేశారని చెప్పుకొచ్చాడు.

Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు

Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More