Home> వినోదం
Advertisement

Attack on Vijay Sethupathi: విజయ్ సేతుపతి లక్ష్యంగా దాడి.. Video viral

Vijay Sethupathi attacked by unknown person: విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి (Attack on Vijay Sethupathi at Bengaluru airport) జరిగిందనే వార్త కలకలంరేపింది. ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. 

Attack on Vijay Sethupathi: విజయ్ సేతుపతి లక్ష్యంగా దాడి.. Video viral

Vijay Sethupathi attacked by unknown person: తమిళ స్టార్ విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఒక సాధారణ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి కష్టపడి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వెళ్లాడు. హీరో అయినా.. విలన్ అయినా.. చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషమైనా.. నటనపై ఉన్న మక్కువతో ఏదీ కాదనకుండా అన్ని పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలితంగా విజయ్ సేతుపతికి తమిళంలోనే కాకుండా దక్షిణాదిన ఉన్న ఇతర భాషల్లోనూ అభిమానులు ఏర్పడ్డారు. 

అలాంటి విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి (Attack on Vijay Sethupathi at Bengaluru airport) జరిగిందనే వార్త కలకలంరేపింది. ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఒక సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా విజయ్ సేతుపతిపై దాడి జరిగినట్లు సమాచారం. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

విజయ్ సేతుపతిపై దాడికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను (video of attack on Vijay Sethupathi) పరిశీలిస్తే.. ముందుగా సదరు ఆగంతకుడు వచ్చి ఎగిరి తన్నగా.. అతడు తన్నిన వ్యక్తి వెళ్లి విజయ్ సేతుపతిపై పడటం కనిపిస్తోంది. వాస్తవానికి విజయ్ సేతుపతిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినప్పటికీ... అతడి గురితప్పినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వెంటనే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది విజయ్ సేతుపతిని (Vijay Sethupathi) అక్కడి నుంచి సురక్షితంగా పక్కకు తీసుకువెళ్లి.. దాడికి పాల్పడిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Read More