Home> వినోదం
Advertisement

Venu Swamy on Samantha : సమంత ఆరోగ్యంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. 2025 నుంచి దారుణంగా?

Astrologer Venu Swamy on Samantha Health: హీరోయిన్ సమంత ఆరోగ్య పరిస్థితి గురించి జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన విషయాలు బయట పెట్టారు, దానైకి సంబందించిన వివరాల్లోకి వెళితే 
 

Venu Swamy on Samantha : సమంత ఆరోగ్యంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. 2025 నుంచి దారుణంగా?

Astrologer Venu Swamy Sensational Comments on Samantha Health: తెలుగు వారందరికీ జ్యోతిష్యుడు వేణు స్వామి సుపరిచితమే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సినీ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ ఉండే వేణు స్వామి గురించి తెలుగు వారందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీణ శ్రీవాణి అనే ఒక వీణ ఆర్టిస్టును ప్రేమించి వివాహం చేసుకున్న వేణు స్వామి ఎక్కువగా సెలబ్రిటీలకు జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు.

ఆయనను పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తూ ఉండడంతో ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. గతంలో నాగచైతన్య, సమంత ప్రేమించి వివాహం చేసుకుంటారని వార్తలు వచ్చిన సమయంలోనే ఆయన ఆ ఇంటర్వ్యూలో తన దగ్గర ఉన్న నాగచైతన్య, సమంత జాతకాల ప్రకారం వారిద్దరూ ప్రేమించి వివాహం చేసుకుంటే ఖచ్చితంగా ఆ వివాహం ఎక్కువ కాలం నిలబడదని అప్పట్లోనే ఆయన కామెంట్ చేశారు.

ఆయన మాటలకు తగ్గట్లుగానే ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తారు అనుకున్న సమంత, నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా అందరికీ వేణు స్వామి మాటలు మీద గురి కుదిరింది. ఆ తర్వాత కూడా ఆయన అనేక విషయాలు సెలబ్రిటీల జీవితాల గురించి చెబుతూ వచ్చారు. వాటిలో కొన్ని నిజమవుతూ రావడంతో ఆయన ఏం చెప్పినా అది నిజమని నమ్మే వారు కూడా కొందరు ఉన్నారు.

అయితే ఇప్పుడు తాజాగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా సమంత ఆరోగ్యం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సమంత మయోసైటిస్ అనే ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అది ప్రాణాంతకమైనా ప్రస్తుతానికి సమంతకు ప్రాణాంతకం అయ్యే ఇబ్బంది లేదని డాక్టర్లు చెబుతున్నారు.

అయితే సమంత ఆరోగ్యం గురించి ఇప్పుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి అదేమిటంటే సమంతకి 2025 వరకు ఎలాంటి ఇబ్బంది లేదని 2025 నుంచి ఆమెకు ఏలిన నాటి శని ప్రారంభమవుతుందని అప్పటి నుంచి ఆమె అనారోగ్యం మరింత దిగజారుతుందని ఆయన కామెంట్ చేశారు. ఇక ఇది కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరో హీరోయిన్ చనిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి.

మేషరాశికి చెందిన ఒక హీరోయిన్ అలాగే వృశ్చిక లేదా మిథున రాశికి చెందిన ఒక హీరో చనిపోయే అవకాశం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027- 28వ సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరో, హీరోయిన్ చనిపోతారని అయితే వారెవరో పెద్ద వయసు వారు కాదని 45 ఏళ్ల లోపు వారే చనిపోతారు అని ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.   
Also Read: Venkatesh Next Movie: హిట్ డైరెక్టర్ కథకు వెంకీ మామ గ్రీన్ సిగ్నల్.. కానీ అంతా కన్ఫ్యూజన్!

Also Read: Korean Content in AHA : మలయాళం అయిపోయింది ఇక కొరియా వంతు.. ఆహా ఫోకస్ మార్చిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

 
 
Read More