Home> వినోదం
Advertisement

Sarkaru vaari paata: మహేష్ బాబుకి విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. కరోనావైరస్ కారణంగా అన్ని సినిమాల తరహాలోనే ఈ చిత్రం షూటింగ్ ( Sarkaaru vaari paata movie shooting ) కూడా ఆలస్యం అయింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం యుఎస్‌లో జరుగనుంది. సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురాం ( Director Parasuram ) ప్రస్తుతం షూటింగ్ లొకేషన్స్ వెతకడం కోసం అమెరికా వెళ్లాడు. 

Sarkaru vaari paata: మహేష్ బాబుకి విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. కరోనావైరస్ కారణంగా అన్ని సినిమాల తరహాలోనే ఈ చిత్రం షూటింగ్ ( Sarkaru vaari paata movie shooting ) కూడా ఆలస్యం అయింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం యుఎస్‌లో జరుగనుంది.

సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురాం ప్రస్తుతం షూటింగ్ లొకేషన్స్ వెతకడం కోసం అమెరికా వెళ్లాడు. లొకేషన్స్ ఫైనల్ అయిన తరువాత ఈ చిత్ర బృందం కూడా అమెరికా వెళ్ళనుంది. ఇప్పటికే మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల ( Actress Keerthy Suresh ) వీసా, వర్క్ పర్మిట్ ప్రాసెస్‌కి దరఖాస్తు చేసినట్టు సమాచారం. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక ఎన్నారై పాత్రలో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట సినిమా బ్యాంకింగ్ స్క్యామ్స్ ( Banking scams ) నేపధ్యంలో తెరకెక్కబోతోంది. Also read : Drugs case: రకుల్ ప్రీత్ సింగ్ ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన NCB

ఈ సినిమాలో విలన్ కీలక పాత్ర పోషించనున్నాడు అని తెలుస్తోంది. అందుకే విలన్ పాత్ర పోషించే నటుడి కోసం గత కొన్ని రోజులుగా ఈ చిత్ర బృందం చాలా మంది నటుల పేర్లను పరిశీలించారు. కాని ఎవ్వరూ ఖరారు కాలేదు. ఐతే, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం 'అరవింద్ స్వామి' విలన్ పాత్ర ( Arvind Swamy as villain) కోసం ఖరారైనట్టు తెలుస్తోంది.

అరవింద్ స్వామి ఈ చిత్రంలో విలన్‌గా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఇంకా ఈ సినిమా బృందం ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే చేయలేదు. Also read : 

మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన ధృవ సినిమాలో ( Ram Charan's Dhruva ) విలన్ పాత్రలో అరవింద్ స్వామి నటన ఎంత చక్కగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇక మరోసారి ''మహేష్ బాబు లాంటి అందగాడి సినిమాలో ఒకప్పుడు అందగాడు అనిపించుకున్న స్టార్ హీరో అరవింద్ స్వామి లాంటి నటుడు విలన్‌గా కనిపిస్తే.. ఆ స్క్రీన్ ఇంకెంత అందంగా ఉంటుందో కదా'' అని మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More