Home> వినోదం
Advertisement

అర్జున ఫాల్గుణ నుంచి కాపాడేవా రాపాడేవా లిరికల్ సాంగ్ విడుదల

శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న అప్‌కమింగ్ సినిమా అర్జున ఫాల్గుణ. తేజ మర్ని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ అమృత అయ్యర్ జంటగా నటిస్తోంది. మ్యాటిని ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అర్జున ఫాల్గుణ నుంచి కాపాడేవా రాపాడేవా లిరికల్ సాంగ్ విడుదల

శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న అప్‌కమింగ్ సినిమా అర్జున ఫాల్గుణ. తేజ మర్ని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ అమృత అయ్యర్ జంటగా నటిస్తోంది. మ్యాటిని ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

సినిమా విడుదల తేదీ సమిపిస్తున్న తరుణంలో ఇటీవలే ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మూవీ యూనిట్ తాజాగా కాపాడేవా రాపాడేవా లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటను బుల్లెట్ బండి ఫేమ్ సింగర్ మోహన భోగరాజు పాడింది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. 

Also read : కేటీఆర్ పోస్ట్‌పై సమంత రియాక్ట్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌

అనుకోని పరిస్థితుల్లో ఊహించని విధంగా కష్టాలపాలై పోరాటంలోకి దిగిన ఓ యువకుడు.. తాను విజయం సాధించేందుకు ఎలాంటి పంథాను ఎంచుకున్నాడు ? ఎలా విజయం సాధించాడనేదే ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారని టాక్. బ్రోచేవారెవరురా, తిప్పర మీసం, గాలి సంపత్, రాజ రాజ చోర వంటి చిత్రాల తర్వాత శ్రీ విష్ణు చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీ విష్ణు కసిమీదున్నాడు.

Also read : మోహన్ బాబు ఇంట విషాదం.. రంగస్వామి నాయుడు మృతి

Also read : యూట్యూబ్ లో మరో రికార్డు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More