Home> వినోదం
Advertisement

Anupama Parameswaran: బేబీ బంప్‌తో అనుపమ పరమేశ్వరన్.. షాక్‌లో ఫాన్స్! కంగ్రాట్స్ చెప్పిన కమెడియన్!!

కొద్ది క్షణాల క్రితం మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరణ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో అనుపమ బేబీ బంప్‌తో (గర్భవతిగా) కనిపిస్తున్నారు.

Anupama Parameswaran: బేబీ బంప్‌తో అనుపమ పరమేశ్వరన్.. షాక్‌లో ఫాన్స్! కంగ్రాట్స్ చెప్పిన కమెడియన్!!

Anupama Parameswaran shares Baby Bump Pictures: 'ప్రేమమ్' స్టార్ అనుపమ పరమేశ్వరణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  సంక్రాంతికి 'రౌడీ బాయ్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో కొత్త హీరో ఆశీష్ పక్కన అనుపమ నటించారు. ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. అనుపమ మాత్రం హైలెట్ అయ్యారు. లిప్ లాక్ సీన్లలో నటించేది లేదు అని గతంలో తెగేసి చెప్పిన అనుపమ.. చివరకు కొత్త హీరోతో హద్దులు దాటారు. అంతేకాదు రౌడీ బాయ్స్'సినిమాకు మలయాళీ ముద్దుగుమ్మ తీసుకున్న రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ అయింది. 

కొద్ది క్షణాల క్రితం అనుపమ పరమేశ్వరణ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో అనుపమ బేబీ బంప్‌తో (గర్భవతిగా) కనిపిస్తున్నారు. ఫొటోలో అనుపమ పాపిడిలో కుంకుమ, నైటీ వేసుకొని సాధారణ గృహిణిగా ఉన్నారు. తన చేతును బేబీ బంప్‌పై పెట్టుకుని చిరునవ్వు చిందిస్తున్నారు. మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పక్కన ఆమె తండ్రి (పరమేశ్వరణ్ ) కూడా ఉన్నారు. ఆయన కూడా ఆనందంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

బేబీ బంప్‌తో ఉన్న అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటో చూసిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఒక్కసారిగా షాక్ అయ్యారట. 'బేబ్ నేను ఇంకా సీరియస్ గా కంగ్రాట్స్ అని టైప్ చేయబోయా' అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. మరోవైపు   విషయం తెలిసిన అనుపమ ఫాన్స్, నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. 'అనుపమ పెళ్లి ఎప్పుడు జరిగింది' అనిక్ ఒకరు కామెంట్ చేయగా.. 'ఇది నిజమేనా అను' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

అయితే అనుపమ పరమేశ్వరణ్ నిజంగా గర్భవతి కాదు. 'మనియారాయిలే అశోకన్' అనే సినిమా షూటింగ్ సమయంలో ఈ ఫొటోలు తీసుకున్నారట. ఏదేమైనా అనుపమ ప్రెగ్నెన్సీ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక అనుపమ ప్రస్తుతం నిఖిల్‌తో కలిసి '18 పేజెస్', 'కార్తికేయ 2' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు విడుదల వనున్నాయి.

Also Read: Rafael Nadal Prize Money: టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించిన నాదల్‌కు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందంటే?

Also Read: Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More