Home> వినోదం
Advertisement

Anupama Parameswaran: వాటిని తీసుకొచ్చి ఇస్తే.. నేను మీకు సొంతం అవుతా.. అనుపమ సూపర్ ఆఫర్

Tillu Square: సినిమాలతోనే కాదు ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా కూడా తెగ అలరిస్తూ ఉంటుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈమె పెట్టిన స్టేటస్ ఒకటి తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

Anupama Parameswaran: వాటిని తీసుకొచ్చి ఇస్తే.. నేను మీకు సొంతం అవుతా.. అనుపమ సూపర్ ఆఫర్

Anupama Parameswaran Tweet: ప్రేమమ్, ఆ ఆ..సినిమాల ద్వారా మనకు పరిచయమైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కనిపించిన ఈ హీరోయిన్ ఈమధ్య కార్తికేయ 2 ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే సినిమాల కన్నా కూడా ఇంస్టాగ్రామ్ లో మరింత యక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలో తను ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అవి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా తన బర్త్ డే సందర్భంగా వెకేషన్ కి వెళ్ళిన ఈ బ్యూటీ షేర్ చేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. 
అనుపమ తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకునేందుకు ఈ మధ్యనే మారిషస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ట్రిప్పు కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఈ మధ్య అంత ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలలో ఒక ఫోటోని షేర్ చేసి అనుపమ ప్రస్తుతం ఓ ఆఫర్ ఇచ్చింది. 

అసలు విషయానికి వస్తే అనుపమ తన ఇన్ స్టా స్టోరీలో ఒక్క వీడియోను షేర్ చేసింది. అందులో బేబీ హిప్పోస్ కనిపిస్తున్నాయి. ఈ వీడియోని షేర్ చేస్తూ వాటిని తీసుకొచ్చి బహుమతిగా ఇస్తే నేను మీకు సొంతం అవుతా అంటూ ఆఫర్ ఇచ్చేసింది ఈ హీరోయిన్. అంటే వాటిని గిఫ్టుగా ఇస్తే పెళ్లి చేసుకుంటాను అని ఇలా హింట్ ఇచ్చేసింది. 

కొంతమంది అభిమానులు ఈ స్టేటస్ ని కామెడీగా తీసుకున్న మరి కొంత మంది మాత్రం అసలు ఎందుకు అనుపమ ఇలా పెట్టింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నిజంగానే ఎవరైనా ఓ పిచ్చి అభిమాని ఉంటే.. వాటిని తీసుకొచ్చి ఇస్తే.. అనుపమ ఏం చేస్తుందో చూడాలి.. అంటూ తెగ కామెంట్లు పెడుతూ ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్నారు

కాగా ఈ మధ్యనే రవితేజ ఈగల్ సినిమాలో కనిపించిన అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే సిద్దు జొన్నలగడ్డ సినిమా టిల్లు స్క్వేర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యనే తమిళంలోనూ సైరెన్ అంటూ హిట్టు కొట్టేసింది. మరి తెలుగులో కూడా టిల్లు స్క్వేర్ తో మంచి విజయం అందుకుంటుందేమో వేచి చూడాలి.

Also Read: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Read More